Hyderabad: జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ..
హైదరాబాద్ కు చెందిన బత్తిన కుటుంబం ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. ఈసారి కూడా చేప ప్రసాదం ఇవ్వనున్నారు. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబం తెలిపింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 8న చేప మందు పంపిణీ చేస్తామని ప్రకటించింది. చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు పేర్కొంది.
జూన్ 8న పంపిణీ చేసే చేప మందు తయారీ ప్రారంభించినట్లు బత్తిని కుటుంబం తెలిపింది. మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అందుకే తెలుగు రాష్ట్ర నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాట, చత్తీస్ ఘడ్, ఒడిశా, తమిళనాడు నుంచి ప్రజలు వస్తారు. బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 చరిత్ర ఉందని చెబుతారు.

170 సంవత్సరాల నుంచి బత్తిని వంశానికి చెందిన వారు ఉచితంగా చేప ప్రసాదం ఇస్తారు. చేప మందు పంపిణీలో చేస్తున్న బత్తిని సోదరుల్లో బత్తిని హరినాథ్ గౌడ్ ఒగరుగా ఉన్నారు. ఆయన 1944 లో దూద్ బౌలిలో పుట్టారు. హరినాథ్ గౌడ్ నానమ్మ చేప మందు తయారు చేయడం ఆయనకు నేర్పించింది. హరినాథ్ తాత, తండ్ర చేప ప్రసాదం పంపిణీ చేసినట్లుగానే ఆయన కూడా ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేస్తుండే వారు.
హరినాథ్ గౌడ్ గత సంవత్సరం ఆగస్ట్ 24న కన్నుమూశారు. దీంతో చేప ప్రసాదం పంపిణీ బాధ్యతను కుటుంబం తీసుకుంటోంది. కాగా చేప ప్రసాదాన్ని గతంలో పాతబస్తీలో పంపిణీ చేసేవారు. వచ్చే జనం పెరగడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు పంపిణీ చేస్తున్నారు. చేప మందు వేయించుకునే వారు అక్కడే కొర్రమీను చేప పిల్లను కొనుక్కొని వెళ్లారు. చేప నోట్ల మందు వేసి.. చేపను అస్తమా ఉన్నవారి నోట్లో వేస్తారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications