Food safety: తుప్పు పట్టిన రిఫ్రిజిరేటర్ లో చికెన్, మటన్ నిల్వ.. తనిఖీల్లో బయటపడ్డ దారుణ పరిస్థితులు..!
హైదరాబాద్ లోని హోటల్లు, రెస్టారెంట్లకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు జనాలు. హోటల్లు, రెస్టారెంట్ల కిచెన్లు చూస్తే అందరూ షాక్ అవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నా.. పరిస్థితి మారడం లేదు. అధికారులు ఎప్పుడూ రైడ్స్ చేసిన దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలోని రెండు ప్రముఖ రెస్టారెంట్‌లు, శిల్పి ఎలైట్ రెస్టారెంట్, బార్ అండ్ బహార్ బిర్యానీ కేఫ్‌లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ సోదాలు చేశారు.
పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికలు కూడా కనిపించలేదు. వంటగది అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో ఉంది. జిడ్డుగల పైకప్పులు, ఓపెన్ డ్రెయిన్లు, నిలిచిపోయిన ముగురు నీరు ఉండడం గమనించారు. రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉందని పేర్కొన్నారు. కూరగాయల నిల్వ, రిఫ్రిజిరేటర్ ప్రాంతాలలో బొద్దింకలను గుర్తించాయి. టమాటాలు, కాకరకాయ కుళ్లిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. బహార్ బిర్యానీ కేఫ్‌లో కూడా ఇలాంటవి ఉన్నట్లు చెప్పారు. తాజాగా సికింద్రాబాద్ నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు.

కిచెన్ పరిసరాలు, ప్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. తుప్పుపట్టిన ప్రిడ్జ్ లో చికెన్, మటన్ స్టోర్ చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. అలాగే కిచెన్ లో ఓపెన్ డ్రైనేజీ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అధికారులు దాడులు నిర్వహిస్తున్నా పలు రెస్టారెంట్లు, హోటళ్ల తీరు మారడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటే వారు మారుతారని చెబుతున్నారు. సోమవారం రేష్మ బేగం అనే మహిళ ఫుడ్ పాయిజన్ తో చనిపోయారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు చింతల్ బస్తీలోని మోమోస్ తయారు సేంటర్ లో తనిఖీలు చేశారు.
Food Safety officials have conducted an inspection in 𝗡𝗮𝗻𝗸𝗶𝗻𝗴 𝗖𝗵𝗶𝗻𝗲𝘀𝗲 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁 at 𝗣𝗮𝗿𝗸𝗹𝗮𝗻𝗲, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 on 28.10.2024.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) October 29, 2024
* FSSAI license copy was not displayed at a prominent location.
* Refrigerators were in unhygienic condition… pic.twitter.com/My8y7LZbEU
అక్కడ అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించారు. వెంటనే దాన్ని సీజ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ నందినగర్ లో సంత జరిగింది. అందులో ఓ మోమోస్ సెంటర్ వద్ద రేష్మ బేగం, ఆమె పిల్లలు మోమోస్ తిన్నారు. శనివారం ఉదయం నుంచి వారు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ఆస్పత్రికి తరలించగా..రేష్మ బేగం మృతి చెందారు. ఈ ఘటనలో 50 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications