లాక్ డౌన్ వేళ.. హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..
కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్ అల్మాస్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను హరీష్, స్వప్న, గిరీష్, సువర్ణగా గుర్తించారు. హరీష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
అల్మాస్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది. గత రెండు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్క ఫ్లాట్ వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూడగా.. నలుగురు ఉరేసుకుని కనిపించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ దొరకలేదు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.

లాక్ డౌన్ పీరియడ్‌లో ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కుటుంబ కలహాలే ఇందుకు కారణమా.. లేక మరే కారణాలైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. బంధువుల వివరాలు తెలుసుకుని వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు.
Recommended Video
ఇటీవల మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్‌లోనూ ఇద్దరు వివాహితలు ఉరేసుకున్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. సమీపంలోనే మరో చిన్నారి మృతదేహం కూడా లభ్యమైంది. మృతులను కరీంనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. లాక్ డౌన్‌కు ముందు హైదరాబాద్ వచ్చిన వీరు.. ఇక్కడికి ఎందుకొచ్చారు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. భర్తలు మందలించడం వల్లే హైదరాబాద్ వచ్చి ఉరేసుకుని చనిపోయారని తెలిసినప్పటికీ.. స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు.












Click it and Unblock the Notifications