ఆసుపత్రిలో రచ్చ రచ్చ.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్ లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో రచ్చ రచ్చ చేసిన నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన షమీమ్ బేగం మృతిచెందడంతో ఆమె బంధువులు హాస్పిటల్ లో గందరగోళం సృష్టించారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
ఆరోగ్యశ్రీ సేవలకు లైన్ క్లియర్.. ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ
అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడికి దిగారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమేరకు నలుగురు నిందితుల్ని గుర్తించారు. సుజత్ అలీఖాన్, భర్కత్ అలీఖాన్, మోహిన్ ఖాన్,
మోహినోద్దీన్ అలీఖాన్ ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.