హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హమ్మయ్యా.. గాంధీలో ఒమిక్రాన్ పరీక్షలు.. అందరికీ నెగిటివ్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్‌తో హై టెన్షన్ నెలకొంది. ఒమిక్రాన్ కేసులు దేశంలో 2 వందలకు మించి వచ్చాయి. రాష్ట్రాల వారీగా తెలంగాణ మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఉన్న గాంధీలో పరీక్షలు మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి కేంద్రంగా ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేస్తున్నారు. ప్రత్యేక కిట్లు తెప్పించిన ప్రభుత్వం.. మొదటి బ్యాచ్ కింద 48 శాంపిల్స్ పరీక్ష జరిపింది. గాంధీ ఆసుపత్రిలో మొదటిసారి చేసిన జీనోమ్ సీక్వెన్స్‌లో అన్ని శాంపిల్స్ నెగిటివ్ ఫలితాలను ఇచ్చాయి. అన్ని కేసుల్లోనూ డెల్టా వేరియంట్ ఆనవాళ్లే ఉన్నాయని గుర్తించారు.

ఇతర కేంద్రాల్లో చేసిన ఫలితాల ఆధారంగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలోనూ ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

gandhi hospital conduct omicron tests, all are negative

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. అతని ప్రైమరీ సెకండరీ కాంటాక్టులకు సెకండ్ చేశారు. అతని భార్య, తల్లికి కరోనా సోకింది. దీంతో వారి శాంపిల్స్ కూడా జినొమ్‌కు పంపిస్తారు. అక్కడ పరీక్ష ఫలితంతో ఒమిక్రానా కాదా అనే అంశం తెలియనుంది. ఇటు హైదరాబాద్‌లో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. కెన్యా నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్‌ వైరస్ సోకింది. హయత్‌నగర్‌లో ఉన్న అతడిని వైద్యులు టిమ్స్‌కు తరలించారు. బాధితుడి కాంటాక్ట్‌ను గుర్తించి వైద్యులు టెస్టులు చేస్తున్నారు.

Recommended Video

Omicron Variant: Festivals Celebrations పండగలొస్తున్నాయ్‌ జాగ్రత్త

ఇటు టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కోరోజు 10 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆంక్షలు పెడితే ఎలా ఉంటుందనే అంశం గురించి డిస్కష్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ డిసిషన్ తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు ఉలుకు లేదు పలుకు లేదు

English summary
gandhi hospital conduct omicron tests, all are negative. take breath to everyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X