గ్రేటర్ ఎన్నికలు... ఆ ఒక్క చోట కౌంటింగ్ నిలిపివేత... ఎందుకంటే..?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. నేరెడ్‌మెట్‌లో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్‌కి బదులు ఇతర ముద్ర ఉన్న ఓట్లు ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు లెక్కింపును నిలిపివేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నేరెడ్‌మెట్ ఎన్నికల నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి పంపినట్లు తెలిపారు.
కాగా,ఈసారి గ్రేటర్‌లో పోలింగ్‌లో కొన్నిచోట్ల స్వస్తిక్ ముద్రకు బదులు పోలింగ్ కేంద్రం సంఖ్యను తెలిపే ముద్రను ఓటర్లకు ఇచ్చామని... కాబట్టి వాటిని కూడా ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ గురువారం(డిసెంబర్ 3) అర్ధరాత్రి సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా... స్వస్తిక్ మినహా ఇతర ముద్రలు కలిగి ఉన్న ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని కోర్టు సూచించింది. ఒకవేళ గెలుపోటములు ఆ ఓట్లపై ఆధారపడి ఉంటే... దానిపై ప్రత్యేక ఆదేశాలిస్తామని చెప్పింది.

ఈసారి గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. దుబ్బాక ఉపఎన్నికతో దూకుడు మీదున్న బీజేపీకి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరింత బూస్టింగ్ ఇచ్చాయి.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ' ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న బిజెపిరాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు' అని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి అమిత్ షా అభినందనలు తెలిపారు.
అటు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గ్రేటర్ ఫలితం తాము ఆశించినట్లుగా రాలేదన్నారు. టీఆర్ఎస్‌కు మరో 20 సీట్లు ఎక్కువ వస్తాయని ఆశించామన్నారు. 12 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న కేటీఆర్... మేయర్ పీఠంపై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉందని పేర్కొనడం గమనార్హం.
Recommended Video
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications