• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీకి 100సీట్లు- రాష్ట్రానికి 2సీఎంలు -భయంతోనే కేసీఆర్ కుట్రలు -బండి సంజయ్ సంచలనం

|

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం 150 డివిజన్లు ఉండగా, కనీసం 100 డివిజన్లలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పొరపాటున ఎంఐఎం పార్టీకిగానీ మేయర్ సీటు దక్కితే.. అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని వ్యాఖ్యానించారు. గురువారం పలు చానెళ్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో ఆయనీ కామెంట్లు చేశారు.

సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు.. బీజేపీ మేనిఫెస్టోలో పాతబస్తీకి భారీగా

 ఎంఐఎంతో బీజేపీకి లింకులు

ఎంఐఎంతో బీజేపీకి లింకులు

పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమని, వాళ్లను ఎంఐఎంను పెంచి పోషించడం వల్లే జనాభా కూడా పెరుగుతోందని బండి సంజయ్ అన్నారు. ‘‘ఎంఐఎంతో బీజేపీకి లింకులున్నాయని, కొందరు నేతలకు సబంధాలున్నాయనేది పూర్తి అవాస్తవం. మజ్లిస్ పార్టీని మేం శత్రువుగానే చూస్తాం. అసలైన మతత్వవాదులను వదిలేసి, బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించడం కేవలం రాజకీయ లబ్ది కోసమే. టీఆర్ఎస్, ఎంఐఎం వేరువేరని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసం బీజేపీ ఏనాడూ దిగజారుడు రాజకీయాలు చేయదు'' అని సంజయ్ పేర్కొన్నారు. అంతకుముందు,

 ఎన్నికల వాయిదాకు కేసీఆర్ కుట్ర..

ఎన్నికల వాయిదాకు కేసీఆర్ కుట్ర..

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. శాంతి భద్రతల సమస్య పేరుతో గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని తెలంగాణ బీజేపీ చీఫ్ అన్నారు. గురువారం సాయంత్రం సురారం‌ ప్రాంతంలో రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వాయిదా కోసం కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలకు సహకరిస్తే గనుక అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండంతో కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ లోనూ రిపీట్ అవుతుందని చెప్పారు. మరోవైపు..

 బండి మాటల్ని ఎవరూ నమ్మరు:కవిత

బండి మాటల్ని ఎవరూ నమ్మరు:కవిత

దివంగత పీవీ, ఎన్టీఆర్ లపైనే కాకుండా గ్రేటర్ లో వరుస ప్రకటనలు చేస్తోన్న బండి సంజయ్‌ మాటల్ని నమ్మేవాళ్లు ఎవరూ లేరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పీవీ, ఎన్టీఆర్‌లకు భారతరత్న ప్రకటించాలని, కేంద్ర మంత్రులు రూ.1,350 కోట్ల వరద సాయం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారని, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కవిత మండిపడ్డారు. ప్రజలు తలదించుకునేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు.

తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ

English summary
amid ghmc elections, telangana bjp chief bandi sanjay kumar once again made sensational remarks. in an interview, sanjay says, bjp will get atleast 100 seats in ghmc elections and if aimim wins mayor seat, then telangana will get second chief minister, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X