Hyderabad: హైదరాబాద్ లో సర్వే చేయనున్న జీహెచ్ఎంసీ..!

హైదరాబాద్‌లో వర్షాకాలానికి ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నగరంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వే చేయనున్నారు. నగరంలో వర్షాకాలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ ప్రణాళిక కోసం డిప్యూటీ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లకు జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

మే 18లోగా నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశించారు. వర్షం కాలం తీసుకోవాల్సి జాగ్రత్తలపై కూడా జీహెచ్ఎంసీ చర్చించినట్లు తెలుస్తోంది. వర్షం వల్ల ఎక్కడ రూడ్లపై నీరు నిలుస్తుంది. ఎక్కడ నీళ్లు ఎక్కువగా నిలిచిపోయే ప్రాంతాలను కూడా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో భారీ వర్షాల పలు చోట్ల కాలనీల్లోకి నీరు వస్తుంది.

GHMC will conduct a survey to identify the dilapidated structures

2021లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ పలు ప్రాంతాలు నీట మునిగిగాయి. అందుకే ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డ్రైనేజీ పై నిర్మాణాలు, చెరువులను అక్రమించడంతో ఇలాంటి పరిస్థితి వచ్చినట్లు గతంలోనే గుర్తించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

జూన్ నుంచి సెప్టెంబరు వరకు కాలానుగుణ వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలోకి జూన్ లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+