శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత....!
శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠా పట్టుబడింది. ఇటివల డీఆర్ఐ అధికారులు దాడులను పెంచడంతో పాటు బంగారం స్మగ్లింగ్‌పై దృష్టి సారించింది. దీంతో శంషాబాద్ వేదికగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అధికారుల నిఘాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది.
బంగారం తోపాటు అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఇద్దరు విదేశీలయును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు . అనంతరం ముఠా నుండి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 14 కోట్ల 46 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కాగా దుబాయ్ నుండి వచ్చిన విమానంలో స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.... బంగారం బిస్కెట్లను బ్లాక్ కలర్ టేప్‌తో చుట్టి విమానం సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేస్తున్నట్టు వారు గుర్తించారు.. ఇక అరెస్టైన వారిలో ఒకరు సౌత్ కొరియాకు చెందిన వాడు కాగా , మరొకరు చైనాకు చెందిన పౌరుడని అధికారులు వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాలో విమాన సిబ్బంది పాత్రపై అనుమానాలు కూడ డిఆర్ఐ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications