కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్
ఆధునిక సమాజంలో కులాల పట్టింపులు, మతాల కుమ్ములాటలు ఓ వైపు సాగుతున్నా... మరోవైపు అదే స్థాయిలో యువతి, యువకులు కులాంతర వివాహాల వైపు అంతే స్థాయిలో మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వం సైతం వారిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికిస్తున్న ప్రోత్సాహాక బహుమానాన్ని కూడ ప్రస్తుతం ఇస్తున్న దానికంటే ఐదు రెట్లు పెంచింది. ఇది నవంబర్ నుండి ఇది అమల్లోకి రానుంది.

కులాంతర వివాహాల కోసం ముందుకు వస్తున్న యువత
సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు కులాంతర వివాహాలు చాలా దోహదం చేస్తాయి.. ఇందుకోసం ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా... దీంతో యువత సైతం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అయితే అక్కడక్కడ కోంత ఇవి వికటిస్తున్నాయి... సాధరణంగా కులంతార వివాహాలు చేసుకున్నవారు ఇంట్లో తల్లిదండ్రులను, ఇతర కుటుంబసభ్యులను ఎదిరించి బయటకు వస్తున్నారు. అనంతరం ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీంతో వివాహాలు చేసుకునేందుకు కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

వివాహాఅనంతరం అనేక ఇబ్బందులు
వివాహ అనంతరం కొంత ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పట్టణాల్లో అయితే ఇలాంటీ వారికి పెద్దగా ఇబ్బంది లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మరికొంత ఇబ్బందిగా మారింది. దీంతో ఉద్యోగాలు లేనివారు స్వయం ఉపాధి కోసం ఇతరులు లేదా స్నేహితులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ పరిణామాలపై యువతియువకులు నిరుత్సహాంగా ఉంటున్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రోత్సహాకాలు ఎటు సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కొంత సహాయాన్ని పెంచాలని చాల రోజులుగా కోరుతున్నారు.

రెండున్నర లక్షల ప్రోత్సాహం
ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇస్తున్న ప్రోత్సహాకం గతంలో 50వేల రూపాయలు మాత్రమే ఉండేది. దీంతో కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువత ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహాకం కంటే ఇటివల తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి పథకంపై మొగ్గుచూపుతున్నట్టు గమనించారు. ప్రోత్సాహక బహుమతి 50వేల రుపాయాలు ఇస్తుంటే కళ్యాణలక్ష్మి పథకం క్రింద లక్షరుపాయలను ప్రభుత్వం ఇస్తుంది. దీంతో ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్న వారికి ఇటివలే రెండున్నర లక్షల రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోను సైతం జారీ చేసింది.

సమాజంలోని మార్పులను అందిపుచ్చుకోని ప్రభుత్వాలు
అయితే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలతో పాటు పలు రిజర్వేషన్లు కూడ కల్పించాలనే డిమాండ్ కూడ వారి నుండి వస్తుంది. సమాజంలోని కులం, మతం అనే అంతరాలు తొలగించేందుకు ఇలాంటీ వివాహాలే పరిష్కారమని స్వాతంత్ర్యం ముందునుండే అనేక మంది సంఘ సంస్కర్తలు వీటీని ప్రోత్సహించారు. అయితే మారుతున్న సమాజంలో యువతి యువకుల్లో మార్పులు వస్తున్నా...అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడంల లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు కులాంతర వివాహాలపై సమీక్ష జరిపి సరైన ప్రోత్సాహాకాలు అందిస్తే సత్పలితాను అందించే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు..
-
గ్యాస్ దొరకటం లేదని కుమారీ ఆంటీ ఆవేదన.. కర్రీ, స్ట్రీట్ ఫుడ్ పాయింట్స్ బంద్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications