హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జుట్టు, గడ్డం మాసిపోయిన వారికి శుభవార్త..! 20తర్వాత సెలూన్లకు సడలింపు..? ఎక్కడో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా కష్టాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో ఎవరు ఎదుర్కోవాల్సిన సమస్యలను వారెదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సొంతంగా గడ్డం చేసుకోలేని వారు మాత్రం తెగ ఇబ్బందులకు గురౌతున్నట్టు తెలుస్తోంది. మాసిన గడ్డాన్ని మోసుకోలేక, సొంతంగా షేవింగ్ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

సెలూన్లకు సడలింపునిస్తే బాగుంటుందని, సెలూన్ షాపుల వైపు చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు మాసిన గడ్డం వాళ్లు. కాగా ఈనెల 20 తర్వాత కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో భాగంగా మంగలి షాపులకు మినహాయింపులివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఐతే ఇలాంటి సమస్యను అర్ధం చేసుకున్న ఆ రాష్ట్రం మాత్రం ఈనెల 20నుండి అక్కడ సెలూన్లకు అనుమతి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Good news for those who have long hair and beard..!

పెరిగిన జుట్టు, మాసిన గడ్డం వారి పట్ల కనికరం చూపిస్తోంది ఆ రాష్ట్రం. సెలూన్లపై ఉన్న ఆంక్షలను సడలించబోతోంది ఆ రాష్ట్రం. ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల సడలింపునకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏప్రిల్ 20 తర్వాత సెలూన్లు తెరిచేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు అనుమతులను మంజూరి చేసింది. అయితే వారం మొత్తం కాకుండా కేవలం శని, ఆది వారాల్లో మాత్రమే సెలూన్లను తెరిచేందుకు అనుమతినిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP

అయితే సెలూన్లల కూడా భౌతిక దూరం, హ్యాండ్ వాష్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఈ సడలింపు కేవలం క్షౌరశాలలకు మాత్రమే వర్తిస్తుందని, బ్యూటీపార్లర్లకు, మస్సాజ్ సెంటర్లకు కాదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలను పాటించాలని సెలూన్ షాపుల నిర్వాహకులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

English summary
The Kerala government has taken steps to ease the lockdown restrictions after April 20. After April 20, the Kerala government has almost given permission to open salons. However, the Kerala government has announced that it will be open only on Saturdays and Sundays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X