Raja Singh: ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముత్యాలమ్మ గుడికి వెళ్తా.. స్పష్టం చేసిన రాజా సింగ్..
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఆదివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
సికింద్రాబాద్‌లోని మఠం ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఎందుకు ఆపుతుందని ప్రశ్నించారు. మరోసారి ఈరోజు పోలీసులు తనను గృహనిర్బంధంలో ఉంచారని చెప్పారు. తనను మౌనంగా ఉంచమని దారుస్సలాం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అని నిలదీశారు.
ఎంతకాలం తనను అణచివేయడానికి ప్రయత్నిస్తారు? మీరు తన దారిలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తను త్వరలో ఆలయాన్ని సందర్శించి.. మఠం ముత్యాలమ్మ ఆశీస్సులు పొందుతాను చెప్పారు. గోషామహల్ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న పోలీసు సిబ్బంది ఆయనను సికింద్రాబాద్‌కు వెళ్లనీయకుండా ఆపారు. రాజా సింగ్ ను హౌస్ అరెస్ట్ చేయడం ఇది మొదటి సారి కాదు. అంతకుముందు కూడా రాజా సింగ్‌ను సోమవారం ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నప్పుడు గృహనిర్బంధంలో ఉంచారు.

అక్టోబరు 14న సికింద్రాబాద్ ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. గమనించిన స్థానికులు వ్యక్తి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలువురు నాయకులు, స్థానికులు నిరసనలు చేపట్టారు. అంతకుముందు హైదరాబాద్‌లో ఆలయాలను అపవిత్రం చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Why is the Congress government stopping me from visiting the Matha Muthyallamma Temple in Secunderabad? Once again, the police have put me under house arrest today.
— Raja Singh (@TigerRajaSingh) October 20, 2024
Is the government acting on orders from Darussalam to silence me? How long will you try to suppress me? No matter… https://t.co/e7j5rnjlSV pic.twitter.com/bMnENphtvx
మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు లేదా దొంగలకు ఆపాదించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని కిషాన్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ముత్యాలమ్మ గుడి పునర్ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించింది. ఈ ఇందుకు సంబంధించి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక ప్రకటన చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications