31ఫస్ట్ కిక్: వైన్ షాపులకు మరో గంట అనుమతి, పర్మిషన్ ఇచ్చిన సర్కార్
మరో 4 రోజుల్లో న్యూ ఇయర్.. 2021కి బై బై చెప్పి.. 2022కి వెల్ కం చెప్పేందుకు ప్రతీ ఒక్కరూ రెడీగా ఉన్నారు. అయితే కరోనా.. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళన కలిగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం న్యూ ఇయర్.. 31 ఫస్ట్ బిజినెస్ సేల్ చేయాలని అనుకుంటున్నాయి. ఎప్పటిలాగే.. ఈ సారి వైన్ షాపులు ఓపెన్ చేయడంపై అనుమతి ఇచ్చింది. దీంతో మద్యం విక్రయాలు జరిగి.. తమకు ఆదాయం సమకూరుతుందని అనుకుంటుంది.

గుడ్‌న్యూస్..
మద్యం బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఇవాళ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. మద్యం షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లకు అవకాశం ఇచ్చారు. ఈవెంట్స్, టూరిజం హోటల్స్ కు రాత్రి 1 గంట వరకు విక్రయాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు.

మందు ఉండాల్సిందే..
పార్టీ జరుపుకుంటే మద్యం ఉండాల్సిందేననని మందుబాబులు అంటుంటారు. న్యూ ఇయర్ వస్తే.. హంగామా మాములుగా ఉండదు. గ్లాసులు గల గలలాడాల్సిందే. డిసెంబర్ 31వ తేదీన మద్యం షాపులకు, బార్లకు, ఇతర వాటికి ప్రత్యేక అనుమతులు జారీ చేస్తుంటాయి. డిసెంబర్ 31, జనవరి 01వ తేదీన రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఆబ్కారీ శాఖ ఖజానా ఫుల్‌గా నిండిపోతుంది. రాత్రి 11 గంటల వరకు బంద్ అయ్యే షాపులు మరో గంట పాటు మద్యం విక్రయాలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చాయి.

ఈ సమయంలో
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా పలు నిబంధనలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై కోవిడ్ ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట్ల థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలు పరిశీలించాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వం స్పష్టంచేసింది.












Click it and Unblock the Notifications