ప్రియాంక రెడ్డి ఇంటికి గవర్నర్ తమిళిసై
దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై పరామర్శించనున్నారు. మధ్యహ్నాం మూడు గంటలకు గవర్నర్ ప్రియాంక ఇంటికి వెళ్లనున్నట్టు అధికారులు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంఘటన కావడంతో గవర్నర్ సైతం సంఘటనపై స్పందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తమకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రోడ్ల పైకి వస్తుండడంతో రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. పలువురు రాజకీయ నాయకులు ప్రియాంకు కుటుంబసభ్యులకు పూర్తి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications