#HangMohammedPasha: ట్రెండింగ్: ఆ కిరాతకుడిని ఉరి తీయాలంటూ నినదిస్తోన్న జనం

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హతమార్చిన దారుణ ఘటనలో ప్రధాన నిందితుడైన మహమ్మద్ పాషాను ఉరి తీయాలంటూ యావత్ భారతదేశం నినదిస్తోంది. #HangMohammedPasha, #MohammedPasha, #BalatkariMohammedNikala, అనే హ్యాష్ ట్యాగ్స్ క్షణాల్లో వైరల్ గా మారడమే దీనికి నిదర్శనం. ప్రియాంకా రెడ్డిని హత్య చేసిన ఘటనలో మహమ్మద్ పాషాను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించిన విషయం తెలిసిందే.

 ఉరి తీయాల్సిందే..

ఉరి తీయాల్సిందే..


అతని పేరు బయటికి వచ్చిన కొద్దిసేపటికే ట్రెండింగ్ లో నిలిచింది. మహమ్మద్ పాషా ఫొటో వైరల్ గా మారింది. ప్రధాన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా సరిపోదని, అతనికి ఉరి శిక్ష విధించాల్సిందేనంటూ నెటిజన్లు, ట్విట్టరెటీలు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ట్విటరెటీలు మహమ్మద్ పాషా పేరుకు హ్యాష్ ట్యాగ్ లను జోడించి, తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అతనిపై ఏ మాత్రం జాలి, దయ చూపించాల్సిన అవసరం లేదని అంటున్నారు.

 మైనర్లని వదలొద్దు..

మైనర్లని వదలొద్దు..

చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని తప్పించుకోనివ్వకుండా చేయాలని గళమెత్తుతున్నారు. ప్రియాంకా రెడ్డిని హత్య చేసిన వారిలో జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు మైనర్లు కావడం వల్ల చట్టప్రకారం వారికి శిక్షను తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలాంటి అవకాశం వారికి ఇవ్వొద్దని నెటిజన్లు, ట్విట్టరెటీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంకా రెడ్డిని హత్య చేసిన కేసులో అవరమైతే.. చట్టాలను సవరించాలని అంటున్నారు.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    మహబూబ్ నగర్ జిల్లా వాసులే..

    మహబూబ్ నగర్ జిల్లా వాసులే..

    ప్రియాంకా రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హతమార్చిన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, కేశవులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే. జొల్లు నవీన్.. నారాయణ పేట మండలం గుడిగండ్లకు చెందిన యువకుడు. మహమ్మద్ పాషాది అదే మండలం జక్లేన్ గ్రామం. వారందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తున్నారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+