హరీశ్.. నీకు నా గతే..? కాస్త ముందు వెనకా, ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ అనుకుంటున్నాయి. అందుకోసమే ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. వాస్తవానికి ఇంకా షెడ్యూల్ రాలే.. అయినా బీజేపీ, టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ దూసుకెళ్లగా.. టీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు రంగంలోకి దిగారు. తాజాగా ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. హరీశ్ రావును ఉద్దేశించి ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

మెప్పు పొందాలని చూస్తూ..
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇస్తున్నాడని ఈటల ఆరోపించారు. పార్టీ పెద్దల మెప్పు పొందాలని హరీశ్ రావు చూస్తున్నాడని విమర్శించారు. అయితే ఇదీ కాసేపు మాత్రమే ఉంటుందని చెప్పారు.

హరీశ్‌కు తన గతే
అంతేకాదు త్వరలో హరీశ్ రావుకు కూడా తనకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అంటే హరీశ్ రావును కూడా బయటకు పంపిస్తారు అని కామెంట్స్ చేశారు. హుజూరాబాద్‌లో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని అన్నారని... అందుకే రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పుడు గెలిచి చూపిస్తానని చెప్పారు. డబ్బు, ఇతర ప్రలోభాలను పాతరేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ఇబ్బందిపెట్టడం సరికాదు
తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ సరికాదు అని హితవు పలికారు. అదీ కాక బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలని సూచించారు. కానీ కొందరికి చుట్టంగా బీహేవ్ చేయడం సరికాదని ఈటల రాజేందర్ హితవు పలికారు. ప్రభుత్వ పెద్దలు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications