Hyderabad: డిసెంబర్ 31 రాత్రి ఫ్లైఓవర్ల మూసివేత.. ఎక్కడెక్కడంటే..!
డిసెంబర్ 31న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. పలు చోట్ల ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. నెహ్రూ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31 నైట్ 10 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాహనాలు తప్ప మిగతా లైట్ మోటర్ వెహికిల్స్ ను అనుమతించరు.

పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ వే
పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ వేపై డిసెంబర్ 31 నైట్ 10 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాహనాలు తప్ప మిగతా లైట్ మోటర్ వెహికిల్స్ ను అనుమతించరు. పలు చోట్లు ఫ్లైఓవర్లు కూడా మూసివేయనున్నారు.

ఫ్లైఓవర్లు
శిల్ప లేఔట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ 1&2, షైక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్డు నెంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైతాలపూర్ ఫ్లైఓవర్, బాలనగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లోఓవర్ మూసివేయనున్నారు.

యూనిఫామ్
అలాగే క్యాబ్, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తో పాటు లైసెన్స్, బండికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. జనాన్ని ఎక్కించుకోకుండా ఖాళీగా తిరిగితే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే 9490617346 నెంబర్ కు వాహనం వివరాలు, ప్రాంతం, సమయం వాట్సాప్ చేయాలని కోరారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు ప్రజలతో బిస్ హిహెవ్ చేయ్యొద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications