Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లలో పెరిగిన రద్దీ.. ప్రయాణికులతో నిండిపోయిన స్టేషన్లు..

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)కు ప్రయాణికుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. ద్విచక్ర వాహనాల్లో వేళ్లే వారు ఎండలకు భయపడి చల్లిటి మెట్రో రైలు ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ భారీగా పెరుగుతోంది. ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు పోటెత్తడంతో.. స్టేషన్లలో భారీగా రద్దీ కనిపిస్తోంది. గురువారం అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ముఖ్యంగా నాగోలు, రాయదుర్గం మార్గంలోని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. నాగోలు మెట్రో స్టేషన్ కు ప్రయాణికులు భారీగా తరలిరావడంతో స్టేషన్ మొత్తం మందితో నిండిపోయింది. స్టేషన్ నిండిపోవడంతో ప్రయాణికులు స్టేషన్ మెట్లపై నిల్చోవాల్సి వచ్చింది.

ఉదయం వేళ్ల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో నాగోలు, అమీర్ పేట రైల్వే స్టేషన్లలో నిమిషానికి ఓ రైలు నడిచినా రద్దీ తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా నాగోలు, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయంలో నష్టాల్లో కొనసాగిన మెట్రో.. తర్వాత క్రమంగా పుంజుకుంటుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతోంది. అమీర్ పేట, రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ కొనసాగుతోంది.

 metro

ప్రస్తుతం రోజుకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 4 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ఐదు లక్షలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవరసం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెట్రో విస్తరణపై అధికారులు దృష్టి పెట్టారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ. 6250 కోట్ల అంచనాతో 31 కిలోమీటర్ల దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఐటీ హబ్ మైండ్ స్పేస్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైను నిర్మించనున్నారు. మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి, నానక్ రాంగూడ జంక్షన్‌ల నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది.

 metro

మరిన్ని మార్గాల్లో కూడా మెట్రో సేవలను విస్తరించేందుకు చర్చలు సాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కూడా మెట్రో తమ ప్రాంతం నుంచి కూడా చేపట్టాలని కోరుతున్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా మెట్రోను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో థర్డ్ ఫేజ్ విస్తరణపై కేటీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. లక్డికాపూల్ నుంచి BHEL వరకు మెట్రో మూడో ఫేజ్ విస్తరణ ఉంటుందని మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+