Hyderabad: వర్షంతో హైదరాబాద్ వాసుల అవస్థలు.. భారీగా ట్రాఫిక్ జామ్..
భాగ్యనగరంలో గత రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వర్షాపు నీరు రోడ్ల పైకి రావడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి చాలా చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడింది. వాననాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాఠశాల, కాలేజీ, కార్యాలయాలకు వెళ్లే వారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. రోడ్లు పై నీరు చేరడం వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది.
హైదరాబాద్ లోని ప్రధాన్ రహదారుల్లో ట్రాఫిక్ అయింది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటి వరకు, లింగంపల్లి నుంచి లక్డీకాపూల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. కేపీహెచ్ పీ జేఎన్టీయూ ముందు నుంచి హైటెక్ సిటీ రోడ్డు వరకు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది ఆఫీస్ లకు లేటుగా వెళ్లారు. ఇంకా వర్షం కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. వానలతో మూసీ ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి పెరిగింది. 645 అడుగులకుగాను 641 అడుగులమేర వరదనీరు చేరింది. అటు నాగార్జునసాగర్ లో 590 అడుగులకు ప్రస్తుతం 517 అడుగుల మేర నీటిమట్టం ఉంది.

మరోవైపు వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వానలు పడొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, పెద్దపెల్లి, మంచిర్యాల, కుమురంబీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో పలు చోట్ల వానలు పడ్డాయి.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా పడుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. భీంగల్ లో అత్యధికంగా 7 సెంటీ మీటర్ల వర్షం పాతం నమోదయ్యింది.












Click it and Unblock the Notifications