Hyderabad: రోడ్లపై వాహనదారుల నరకయాతన.. ఇంకా కురుస్తోన్న వర్షం..
హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట, ఎస్సాఆర్ నగర్, మోతి నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షం కురుస్తోంది. చాలా చోట్లు వర్షపు నీరు రోడ్డుపై చేరింది. చాలా చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆఫీస్ లు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రోడ్లపైనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. రోడ్లపై వర్షపు నీరు ఉండడంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. గురువారం ఉదయం హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కోఠి, దిల్ సుఖ్నగర్, చార్మినార్, మలక్ పేట, ఎల్ బీనగర్, ఉప్పల్, బేగంపేట, నారాయణగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్ ఏరియాల్లో వెహికల్స్ రద్దీ మరింత పెరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

రోడ్లపై నిలిచిన నీటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా శ్రమించాల్సి వస్తుంది. లక్డీకపూల్ నుంచి సచివాలయంలో వెళ్లే దారిలో నీరు భారీగ నిలిచింది. జీహెచ్ఎంసీ సిబ్బంది నీరును క్లియర్ చేస్తున్నా.. వర్షం పడుతుండడంతో ఏం చేయలేకపోతున్నారు. వర్షంతో పలు చోట్ల చోట్లు విరిగిపడ్డాయిత దీంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డిఆర్ఎఫ్టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే హెల్ప్ లైన్ నం. 040-29555500 కు ఫోన్ చేయాలన్నారు. కాగా బుధవారం అత్యధికంగా షేక్ పేటలో 4.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. నగరంలో మరికొద్ద గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications