Heavy Rain: నగరంలో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్.. అవసరముంటేనే బయటకు రావాలి.. జీహెచ్ఎంసీ హెచ్చరిక..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసరమైతేనా బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటలకు జల్లులుగా మొదలైన వాన 8 గంటల తర్వాత కాస్త జోరు పెంచింది. మియాపూర్, నిజాంపేట, లింగంపల్లి, చందనగర్, బాచుపల్లిలో భారీగా వర్షం కురుస్తోంది. జేఎన్టీయూ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, బాలనగర్, మూసాపేట, భరత్ నగర్, మోతినగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, బొరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడలో వాన పడుతోంది.
జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్, మదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, మెహదీపట్నం, మసబ్ ట్యాంక్, లక్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, క్రాస్ రోడు, చిక్కడ్ పల్లి, నారాయణ గూడ, అంబర్ పేట, తర్నాక, ఉప్పల్, రామంతాపూర్, నాగోల్, ఎల్బీనగర్ లో వర్షం కురుస్తోంది. సుచిత్ర,కొంపల్లి,దూలపల్లి, దుందిగల్,గండిమైసమ్మ, మల్లంపేట్,బౌరంపేట్, బాహుదూర్ పల్లి, సురారం,జీడిమెట్ల,షాపూర్ నగర్,చింతల్,గాజులరామారం, జగద్గిరిగుట్టలో ఎకధాటిగా వర్షం కొనసాగుతోంది.

పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ లో ప్రాంతాల్లో చిరుజల్లులు కొనసాగుతోన్నాయి. నార్సింగ్ మున్సిపాలిటీ బాలాజీనగర్ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షంతో నగరంలోని చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందురు పడ్డారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకయాతన అనుభవించారు. కూకట్ పల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
కూకట్ పల్లి నుంచి అమీర్ పేట, ఖైరతాబాద్ మీదుగా కోఠి వెళ్లే రోడ్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పంజాగుట్ట మదాపూర్ మార్గం, సికింద్రాబాద్ జూబీహిల్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అరగంట ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతోంది. మరోవైపు సిటీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రబాద్, శేరిలింగంపల్లి జోన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ కోరింది. కాలనీల్లో నీరు నిలిస్తే టోల్ ఫ్రీ నంబర్లు 040 21111111 లేదా 9000113667 కు కు ఫోన్ చేయాలని సూచించింది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications