హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్మెట్, మాస్క్ మ్యాండెటరీ: రూ.1000 ఫైన్ తప్పదు: పోలీసులు

|
Google Oneindia TeluguNews

హెల్మెట్‌ అలంకారం కోసం కాదని తప్పనిసరిగా పెట్టుకోవాలని పోలీసులు స్పష్టంచేశారు. బైక్ నడిపే వాళ్లు మాత్రమే కాకుండా.. వెనక కూర్చున్న వారు కూడా ధరించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బైక్ మీద వెళ్లే సమయంలో ఎవరికైనా లిఫ్ట్‌ ఇచ్చిన సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. హెల్మెట్‌ లేకుంటే యజమానికే జరిమానా తప్పదని వివరించారు.

99 శాతం మంది

99 శాతం మంది

ప్రస్తుతం టూవీలర్ రైడర్స్ 99 శాతం మంది హెల్మెట్‌ ఉపయోగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే వెనుక కూర్చున్న వారు కూడా ధరించకపోతే పూర్థి స్థాయిలో సేఫ్టీ ఉన్నట్లు కాదన్నారు. రెండేళ్లుగా పిలియన్‌ రైడర్స్‌పై కూడా ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వాహనం వెనుక కూర్చొన్న వారు హెల్మెట్‌ పెట్టుకోకపోతే చలాన్లు విధిస్తున్నారు.

నో మాస్క్..

నో మాస్క్..

మరోవైపు కరోనా తగ్గిందని.. మాస్క్‌ వదిలేశారా..? ప్రమాదం పొంచి ఉందని మరిచిపోవద్దని సూచించారు. ఇలాంటి వారినే ట్రాఫిక్ శాఖ అప్రమత్తం చేస్తుంది. ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులు మాస్క్‌ లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. జరిమానాగా వెయ్యి కచ్చితంగా కట్టాల్సిందేనని స్పష్టంచేశారు. వాహనం నడుపుతున్న వ్యక్తికే కాదు.. వెనుక కూర్చున్న వారికి సైతం మాస్క్‌ మస్ట్‌.. అంటూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

నాన్ కాంటాక్ట్

నాన్ కాంటాక్ట్

నాన్‌-కాంటాక్ట్‌ పద్ధతిలో చలాన్లు విధిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తితోపాటు పిలియన్‌ రైడర్‌కు మాస్క్‌ లేకున్నా జరిమానాలు విధిస్తున్నారు. ఇంటలిజెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ ద్వారా కూడా ఉల్లంఘనదారులకు చలాన్లు జారీ అవుతున్నాయి. ఇంట్లో రెండు హెల్మెట్లు సమకూర్చుకోవడం తప్పని సరి అవుతుంది. టూ వీలర్ మరొకరి ఇచ్చినా.. చలాన్‌ పడితే వాహన యజమానే చెల్లించాలనే సంగతి గుర్తుంచుకోవాలని కోరారు. మరిచిపోకూడదనే చలాన్లు విధిస్తున్నామని.. ముందే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వైరస్ ఇంపాక్ట్

వైరస్ ఇంపాక్ట్


ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

పకడ్బందీగా..

పకడ్బందీగా..

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
helmet and mask mandatory to two wheelers police said to statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X