హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్యూచర్ రిటైల్ నుంచి బయటకొచ్చిన హెరిటేజ్ ఫుడ్స్.. షేర్ల వ్యాల్యూ రూ.132 కోట్లు

|
Google Oneindia TeluguNews

ప్యూచర్ రిటైల్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ బయటకొచ్చింది. తనకు ఉన్న 3 శాతం వాటాను బహిరంగ మార్కెట్‌లో విక్రయించింది. తమ దీర్ఘకాలిక రుణాలను చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీకి విలువ రూ.132 కోట్లు వచ్చాయి. పుచర్ రిటైల్ నుంచి కోటి 78 లక్షల 47 వేల 420 ఈక్విటీ షేర్స్ స్టాక్ మార్కెట్‌ ఓపెన్ షేర్‌లో విక్రయించింది. దీంతో కంపెనీకి రూ.131.94 కోట్లు వచ్చాయని తెలిపింది.

హెరిటేజ్ ఫుడ్ కంపెనీ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి చెందిన సంగతి తెలిసిందే. షేర్ అమ్మడం వల్ల టర్మ్ లోన్ చెల్లించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. ప్యూచర్ గ్రూపులో హెరిటేజ్ ఫుడ్స్ 2016 నవంబర్‌లో చేరింది. అప్పటినుంచి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి.. షేర్ల క్రయ విక్రయాలు జరిగాయి.

Heritage Foods exits Future Retail; sells its entire holding for Rs 132 crore

ప్యూచర్ రిటెల్‌ హెరిటేజ్ చేరగా 3.65 శాతం వాటా కలిగి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల రిటైల్ వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగలేదు. లాక్ డైన్ వల్ల 4 నెలల్లో 7 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. దీంతో ప్యూచర్ రిటైల్ కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. రూ.24 వేల 713 కోట్లకు ఒప్పందం జరిగింది. తమకు నష్టాలు రావడంతోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించినట్టు ప్యూచర్ గ్రూపు ఫౌండర్ కిశోర్ బియానీ తెలిపారు. తాజాగా ప్యూచర్ గ్రూపు నుంచి హెరిటేజ్ కూడా వైదొలిగింది.

English summary
Heritage Foods has sold its entire holding representing over 3 percent stake in Kishore Biyani-led Future Retail for around Rs 132 crore in the open market to mainly repay its long term loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X