హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్, విచారణకు స్వీకరించిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తనపై ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలనీ కోరారు. ఐపీసీ 333సెక్షన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర విచారణ చేపట్టాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని జస్టిస్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రజాప్రతినిధులు కేసు కాబట్టి.. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్ళాలని న్యాయవాదికి సూచించారు. బండి సంజయ్ క్వాష్ పిటిషన్ తమ పరిధిలోకి రాదని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తేల్చేయడంతో మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రీజిస్ట్రికి ఆదేశాలు జారీచేశారు. జస్టిస్ ఉజ్జన్ బాయాల్ బెంచ్‌కు సిఫార్స్ చేశారు. సంజయ్ పిటిషన్ మేర విచారణ జరగనుంది.

high court trial bandi sanjay lunch motion petition

అంతకుముందు బండి సంజయ్‌ కుమార్‌పై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఆదివారం కోవిడ్ నిబంధనలకు సంబంధించి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దానితో సహా మరో పది కేసులను చూపించారు. డిజాస్టర్ మేనెజ్‌మెంట్ యాక్ట్ సహా 3 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో కేసుల వివరాలు ఉన్నాయి.

Recommended Video

పెంచిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళా నేతలు

అంతకుముందు బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. ఆయనకు 14 రోజుల జ్యూడిషీయల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్‌ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 17వ తేదీ వరకుబండి సంజయ్‌తోపాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచ రవి, మర్రి సతీశ్‌లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో హైకోర్టును ఆక్రయించారు.

English summary
high court trial bandi sanjay lunch motion petition on remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X