• search

హైదరాబాద్ లో గుంటూరు టీడీపీ కార్యకర్తలు.. అమీర్ పేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. టీఆర్ఎస్ నేతల దాడి

Subscribe to Oneindia Telugu
For hyderabad Updates
Allow Notification
For Daily Alerts
Keep youself updated with latest
hyderabad News

  హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం మరింత వేడెక్కింది. పోలింగ్ కు మరో నాలుగు రోజులే మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు తమదైన శైలితో ముందుకెళుతున్నాయి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా హైదరాబాద్ లో గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడటం సంచలనంగా మారింది.

  ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సనత్ నగర్ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు డబ్బు పంచుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను నెట్టివేయడంతో టెన్షన్ వాతావరణం క్రియేటయింది.'

  అమీర్ పేటలో కలకలం.. రాత్రంతా హై టెన్షన్

  అమీర్ పేటలో కలకలం.. రాత్రంతా హై టెన్షన్


  అమీర్‌పేట్‌లో ఆదివారం అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. సనత్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ లో గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు ఎస్సైని తోసివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు గోషామహల్ ఏసీపీ ఎంట్రీతో పరిస్థితి సద్దుమణిగింది.

  రెండు కార్లు.. నాలుగున్నర లక్షలు

  రెండు కార్లు.. నాలుగున్నర లక్షలు

  టీఆర్ఎస్ నేతల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరు టీడీపీ కార్యకర్తలు బసచేసిన లాడ్జీలో సోదాలు నిర్వహించారు. రెండు కార్లతో పాటు 4 లక్షల 74 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే డబ్బులు పంచినట్లు ఆధారాలు లభించలేదని, సరైన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

  శేర్‌లింగంపల్లిలో 70 లక్షలు.. అవి కూడా టీడీపీవే

  శేర్‌లింగంపల్లిలో 70 లక్షలు.. అవి కూడా టీడీపీవే

  పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులు వేగవంతమయ్యాయి. వారిని ప్రలోభాలకు గురిచేసేలా డబ్బులు చేతులు మారతున్నాయి. శేర్‌లింగంపల్లి లో ఓటర్లకు పంచేందుకు డబ్బులు తీసుకెళుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అలర్టయ్యారు. దీంతో టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ కుమారుడి కారులో 70 లక్షల రూపాయలు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును సీజ్ చేసిన పోలీసులు.. భవ్య సిమెంట్స్ డైరెక్టర్ శివకుమార్, కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

   టీడీపీ డబ్బులపై టీఆర్ఎస్ గరం

  టీడీపీ డబ్బులపై టీఆర్ఎస్ గరం


  తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోక్యమేంటని టీఆర్ఎస్ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ తో జత కట్టడమే గాకుండా ఎన్నికల ఫండింగ్ మొత్తం ఆయనే సమకూరుస్తున్నారని మండిపడుతున్నారు. ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఫైరవుతున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు అమీర్ పేటలో నగదుతో పట్టుబడటం.. అటు శేర్‌లింగంపల్లిలో 70 లక్షలు దొరకడం టీఆర్ఎస్ నేతల ఆరోపణలకు నిదర్శనంలా నిలుస్తున్నాయి.

  మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP cadre from Guntur caught by Hyderabad police created sensation. TRS leaders are concerned that they are distributing money in the Sanathnagar constituency. The tension atmosphere was created when the police tried to block them.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more