తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు.. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించిన హిమాన్షు
Recommended Video

తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఒక జాతీయ స్థాయి పోటీ లో అగ్ర స్థానం సంపాదించి గోల్డ్ మెడల్ సాధించాడు.
డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ తాజాగా బెహతర్ ఇండియా క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగంలో హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి గా హిమాన్షు రావు బంగారు పతకం సాధించాడు. కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ , పునరుత్పాదక వ్యర్ధాలను సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. పాఠశాల విభాగంలోనూ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 34,137 కిలోల రీసైకిలబుల్ వేస్ట్‌ను సేకరించి మూడో స్థానంలో నిలిచింది.

బెహతర్ ఇండియా క్యాంపెయిన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఢిల్లీలో క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పరిణితీ చోప్రా చేతుల మీదుగా పతకాలను ప్రదానం చేశారు. ఓక్రిడ్జ్ పాఠశాల యాజమాన్యాన్ని, వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన హిమాన్షును డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ పెబ్బీ అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అర్జున్‌రావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బెహతర్ ఇండియా కార్యక్రమంలో రెండు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు. హిమాన్షు రావు జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించడంతో ఇప్పుడు అందరూ తాత కేసీఆర్ తెలివి, తండ్రి కేటీఆర్ నేర్పరితనం రెండు హిమాన్షు కు వచ్చాయని చర్చించుకుంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications