గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్... హోంమంత్రి మహమూద్ అలీ కీలక ఆదేశాలు...
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్,ఇతర అధికారులతో గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ మీడియాకు అందింది. దీని ప్రకారం ఈ నెల 5న తన అక్క భర్తను గాంధీలో అడ్మిట్ చేశారు. అక్క తోడుగా ఇద్దరు చెల్లెళ్లు ఆస్పత్రికి వచ్చారు. అక్క బర్తను గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేయడంలో ఉమా మహేశ్ అనే వ్యక్తి సహాయం చేశాడు. గాంధీ ఆస్పత్రిలో అతను ఎక్స్ రే విభాగంలో పనిచేస్తున్నాడు.

అక్కతో పాటే ఇద్దరు చెల్లెళ్లు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇదే క్రమంలో మూడు రోజుల తర్వాత ఆ అక్కా చెల్లెళ్ల వద్దకు ఉమా మహేశ్వర్, సెక్యూరిటీ గార్డు వచ్చారు. ముగ్గురిలో ఒకరిని ఔట్ పేషెంట్ వార్డు పక్కనున్న సెక్యూరిటీ గదిలోకి తీసుకెళ్లాడు ఉమా మహేశ్వర్. ఆమె ముక్కుకు మత్తు మందు ఉన్న ఖర్చీఫ్‌ను పెట్టాడు. ఆమెకు మత్తు ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్పృహలోకి వచ్చేసరికి తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు గుర్తించింది.
అక్కడి నుంచి బాధితురాలు నేరుగా తమ స్వగ్రామానికి వెళ్లిపోయింది. అప్పటికే సోదరి ఆచూకీ తెలియట్లేదు. దీంతో మొదట మహబూబ్ నగర్ పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచన మేరకు తిరిగి హైదరాబాద్ చేరుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహేశ్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై 342, 376 డీ, 328 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో క్లూస్ టీమ్ మంగళవారం(ఆగస్టు 17) పలు కీలక ఆధారాలు సేకరించింది.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.రాష్ట్ర మహిళా ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications