రైలులో సైడ్ లోయర్ బెర్త్ కోసం ఇలా చేయండి
రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సమయంలో ప్రతి ఒక్కరూ లోయర్ బెర్త్ కు ప్రాధాన్యత ఇస్తారు. అందులోను సైడ్ లోయర్ కోరుకుంటారు. ఆ సీటు వస్తే చక్కగా కిటికీ పక్కన కూర్చొని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అది కాకుండా వేరే బెర్త్ లు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ వస్తే వాటిపైకి ఎక్కి కూర్చోవాల్సి ఉంటుంది. సైడ్ లోయర్ బెర్త్ కోసం ఐఆర్ సీటీసీ కొన్ని నిబంధనలను రూపొందించింది. ప్రత్యేకంగా కొందరికి అది రిజర్వేషన్ చేసింది. వాటి వివరాలను తెలుసుకుందాం.
వయసు ప్రకారం మొదటి ప్రాధాన్యత
లోయర్ బెర్త్ ను రైల్వే వృద్ధులకు కేటాయిస్తుంది. 60 సంవత్సరాలు దాటిని పురుషులకు, 55 సంవత్సరాలు దాటిని మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తారు. వారితోపాటు వికలాంగులకు, గర్భవతులకు కూడా కేటాయిస్తారు. ప్రతి స్లీపర్ బోగీలో దివ్యాంగులకు నాలుగు సీట్లు, థర్డ్ ఏసీలో రెండు, 3ఈలో రెండు రిజర్వు చేస్తారు. స్లీపర్ లో రెండు కింద, రెండు పైన ఇస్తారు. టికెట్ బుకింగ్ సమయంలో అప్పర్ బెర్త్ లు వస్తే టీటీఈతో మాట్లాడి లోయర్ బెర్త్ ను తీసుకోవచ్చు. రిజర్వేషన్ సమయంలోనే చెప్పినా టికెట్లు బుక్ చేసే ఉద్యోగి లోయర్ బెర్త్ ను బుక్ చేస్తారు.

రాత్రి నిద్రించినా పగలు వారికివ్వాలి
లోయర్ బెర్త్ వచ్చినవారు రాత్రి సమయంలో నిద్రించినా పగటివేళ అప్పర్ బెర్త్ వారికి సగం సీటివ్వాలి. ఆర్ఏసీ టికెట్ ఉన్నవారు కూడా లోయర్ బెర్త్ వారితో కలిసి పంచుకోవాలి. ఆర్ఏసీ టికెట్ వచ్చినవారు ఇద్దరు ఉంటే.. ఇద్దరూ కూర్చొని ప్రయాణిస్తారు. ఐఆర్ సీటీసీ సైట్ కు వెళ్లి సరైన ఆప్షన్ ఎంచుకొని టికెట్ ను బుక్ చేసుకోవాలి. దాని ప్రకారం నిబంధనలకు లోబడి రైల్వే సాఫ్ట్ వేర్ బెర్త్ ను కన్ఫామ్ చేస్తుంది. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కూడా వయసును బట్టి లోయర్ బెర్త్ ను రైల్వే ఇస్తుంది. ప్రత్యేకంగా ఈ బెర్త్ లు కావాలనుకునేవారు ఐఆర్ సీటీసీకన్నా రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో బుక్ చేసుకుంటే అక్కడ ఉండే ఉద్యోగి మనకు కోరిన విధంగా టికెట్ ను బుక్ చేసి ఇచ్చారు.












Click it and Unblock the Notifications