వైన్ షాపులకు పోటెత్తుతున్న దరఖాస్తులు.. నాన్ రీఫండబుల్ అని చెప్పినా..
తెలంగాణలో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆ 2 లక్షల డిపాజిట్ నాన్ రీఫండబుల్ అని చెప్పినా.. ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. మద్యం విక్రయించడం మంచి ఆదాయ మార్గం అని అందరూ భావిస్తున్నారు. అందుకే ఆ దందాలో దిగాలను అనుకుంటున్నారు. వస్తే రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు వస్తాయి. పోతే రూ.2 లక్షలు పోతాయని అందరూ ధైర్యం చేస్తున్నారు.

మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నూతన మద్యం పాలసీ ప్రకారం.. డిసెంబర్ ఒకటి నుంచి నూతన లైసెన్సులు కేటాయిస్తారు. అర్హులైన వారి నుంచి ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. గతంలో ఉన్న మద్యం దుకాణ లైసెన్స్ దరఖాస్తునకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును నిర్ణయించారు. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,600 దరఖాస్తులు వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది.
సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 3,750 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,064 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒకే రోజు 684 దరఖాస్తులను ఎక్సైజ్ అధికారులు స్వీకరించారు. హైదరాబాద్‌లోనూ ఇప్పటి వరకు 277 వచ్చినట్టు తెలిసింది. 2019లో మద్యం దుకాణ లైసెన్స్‌లకు మొత్తం 49వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 50వేలకుపైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాన్ రీ పండబుల్ ఆదాయం ఎక్కువ అవుతుంది. ఇదీ ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉంటుంది. గతంలో నాన్ రీఫండబుల్ అమౌంట్ రూ. లక్ష ఉండేది. దానిని ప్రభుత్వం ఒక్కసారిగా డబుల్ చేసింది. అయినా షాపుల కోసం ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల కొత్తగా వైన్ షాపులను కూడా మంజూరు చేశారు. దూరం.. మండలాల వారీగా కేటాయింపులు చేశారు. కొత్త కేంద్రాలపై కూడా కొందరు ఫోకస్ చేశారు. అయితే వారంతా సిండికేట్ అవుతారని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఎప్పటి వారికే వైన్ షాపులు వస్తాయని అంటారు.












Click it and Unblock the Notifications