సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న పలువురు
సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్ కాంప్లెక్స్‌లోని 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్ కాంప్లెక్స్‌లోని 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
స్వప్న కాంప్లెక్స్ లోపలు పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనంపైనుంచి కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో లైట్ చూపిస్తూ తమను కాపాడాలంటూ కోరుతుున్నారు. ఫైర్ సిబ్బందితోపాటు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
Massive fire breaks out in #SwapnaLok complex in #Secunderabad pic.twitter.com/JcSdpghSAn
— Mohammed abdul akram أکرم (@maakramhyd) March 16, 2023
హైడ్రాలిక్ క్రేన్ సాయంతో భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. మరికొందరు కూడా భవనంలో ఉన్నారని చెప్పడంతో వారిని కూడా రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి కిందికి వచ్చిన తర్వాత.. మరో ఏడుగురు భవనంలోనే చిక్కుకున్నారని.. వారికి ఆక్సిజన్ అవసరం ఉందని అధికారులకు తెలిపాడు. దీంతో ఆక్సిజన్ సిలిండర్లతో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది భవనంలోకి వెళ్లారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడామని, మిగితా వారిని కాపాడుతామని చెప్పారు.
కాగా, స్వప్న కాంప్లెక్స్‌లో 200 షాపులు, 160కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలున్నాయి. రాత్రి సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

మరోవైపు, మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు తెలిపారు.
Fire Accident at Swapnalok complex in secunderabad on Thursday evening. @XpressHyderabad @NewIndianXpress @madhavitata @balaexpressTNIE @Bachanjeet_TNIE pic.twitter.com/9vNKlTlG5f
— R V K Rao_TNIE (@RVKRao2) March 16, 2023
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్లలోని కోంపల్లి ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. కంపెనీలోని కెమికల్ డ్రమ్ములు పేలిపోతుండటంతో మరింతగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications