Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం .. పట్టభద్రుల చైతన్యం ఎవరికి పట్టం కడుతుందో !!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అనూహ్యంగా తమ ఓటు నమోదు చేశారు. గతంతో పోలిస్తే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం చీకటి పడే వరకు కూడాజరిగిన పోలింగ్ లో చిన్న చిన్న ఘటనలు మినహాయించి పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగింది.

మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 64.87 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 76.35 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు.

భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడంతో లెక్కల్లో రాజకీయ పార్టీలు

భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడంతో లెక్కల్లో రాజకీయ పార్టీలు


గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందన్న లెక్కల్లో రాజకీయ పార్టీల నేతలు మునిగిపోయారు. ఏయే పోలింగ్ సెంటర్లో ఎంత ఓటింగ్ శాతం నమోదయింది అన్న వివరాలను తెప్పించుకొని ఏ పార్టీకి ఓట్లు పడే అవకాశాలు ఉంటాయని విశ్లేషణలు చేస్తున్నారు.

ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు, సాధారణ ఎన్నికల తరహాలో హోరాహోరీగా ప్రచారం సాగించిన అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటడం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.

ఎవరికి వారు గెలుపుపై ధీమాలో

ఎవరికి వారు గెలుపుపై ధీమాలో

గెలుపు తమదంటే తమదని అటు టిఆర్ఎస్ , ఇటు బిజెపి నేతలు చెప్తుండగా కాంగ్రెస్, టిడిపి తో సహా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం పై ధీమాతో ఉన్నారు. సహజంగా సాధారణ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి మైనస్ అవుతుందని భావిస్తారు. ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ శాతం అధికార పార్టీకి మైనస్ అవుతుందా అన్నది అందరూ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2015 పోలింగ్ శాతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం చాలా ఎక్కువ

2015 పోలింగ్ శాతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం చాలా ఎక్కువ

పోలింగ్ సందర్భంగా చాలా మంది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని, ప్రతిపక్ష పార్టీ ల పై దాడులు చేశారని అయినప్పటికీ పట్టభద్రులైన ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ తీర్పు ఇచ్చారని ప్రతిపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు.

గతంలో నమోదైన పోలింగ్ పర్సంటేజ్ తో పోలిస్తే ఈసారి గణనీయంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. 2015లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ స్థానంలో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో కేవలం 39 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది.

ఈ ఎన్నికల సమయానికి మారిన రాజకీయ పరిస్థితులు

ఈ ఎన్నికల సమయానికి మారిన రాజకీయ పరిస్థితులు

అభ్యర్థులు ఊహించిన దానికన్నా ప్రస్తుతం పోలింగ్ దాదాపు 15 శాతం అదనంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ శాసనమండలి స్థానం నుంచి 93 మంది, నల్గొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటంతో భారీ సైజు బ్యాలెట్ పేపర్ లను , జంబో బ్యాలెట్ బాక్స్ లను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు అధికారులు. రాత్రి 7 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అనేక కీలక మార్పులు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది .

 పెరిగిన ఓటరు చైతన్యం .. ఎవరికి లాభం చేకూరుస్తుందో !!

పెరిగిన ఓటరు చైతన్యం .. ఎవరికి లాభం చేకూరుస్తుందో !!

రాజకీయ పార్టీలు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించటంలో కీలక పాత్ర పోషించడం, సాధారణ ఎన్నికల తరహాలో సాగిన హోరాహోరీ ప్రచారం, ఆదివారం పోలింగ్ నిర్వహణ వంటి కారణాలు ఈసారి పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచాయి .


ఈసారి ఓటర్లలో అధికంగా చైతన్యం కనిపించడం హర్షించవలసిన అంశమే అయినప్పటికీ ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది ప్రస్తుతం సాగుతున్న చర్చ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+