వావ్.. త్వరలో డీజీ యాత్ర.. 7 నగరాల్లో ఎఫ్ఆర్‌పీ సిస్టమ్, అందులో హైదరాబాద్ కూడా..
డీజీ యాత్ర కార్యక్రమం ద్వారా విమానాశ్రయాల్లో సేవలను మరింత సరళతరం చేయనున్నారు. దేశంలో గల ఏడు విమానాశ్రయల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలులోకి రానుంది. వచ్చే ఏడాది మార్చి వరకు దశలవారీగా ఈ విమానాశ్రయాల్లో ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి రానుంది. కోల్‌కతా, వారణాసి, పుణె, విజయవాడ, బెంగళూర్, ఢిల్లీ, హైదరాబాద్ ఆ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ లోక్‌సభలో ప్రకటన చేసింది. ప్రయాణికులకు ఒత్తిడి లేకుండా అనుభూతిని ఇవ్వడమే తమ లక్ష్యం అని పేర్కొంది.

ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు
అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ (ఐఏటీఏ) కోసం ఆధునాతన పద్ధతులను అమల్లోకి తీసుకు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు మేలు జరుగుతుందని.. వారు వెళ్లే సమయంలో చిరాకు, ఇబ్బంది లేకుండా ఉంటుందని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ లోక్ సభలో తెలిపారు. దీనికి సంబంధించి బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ఇప్పటికే టెస్ట్ చేశామని తెలిపారు. వారణాసి, పుణె, కోల్ కతా, విజయవాడ.. జాయింట్ వెంచర్స్ ఎయిర్ పోర్టులు హైదరాబాద్, బెంగళూరు, న్యూ ఢిల్లీలో కూడా పూర్తి చేశామని తెలిపారు.

భద్రత ముఖ్యం
భద్రత తమకు ముఖ్యం అని.. పేర్కొన్నారు. ఇప్పటికే బ్యూరో ఆఫ్ సివల్ ఏవియేషన్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ భద్రతా పరమైన తనిఖీలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మిగతా సంస్థలు అభిప్రాయం తీసుకొని అప్ గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించి ప్రాథమిక పరీక్ష చేశామని తెలిపారు. ఇప్పటికే కార్యక్రమం ఏర్పాటు చేశామని.. పేర్కొన్నారు.

యాప్ ద్వారా రిజిస్ట్రేషన్
ప్రయాణికులు తమ వివరాలు, పీఎన్ఆర్, బయోమెట్రిక్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. వారు విమానం దిగి వెళ్లే సమయంలో యాప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. డీజీ యాత్ర సర్వీస్ వాడటం ద్వారా ప్రయాణికులు సమయం సేఫ్ అవుతుంది. ఒకవేళ ప్రయాణికుడు డీజీ యాత్ర సర్వీస్ వద్దనుకుంటే.. అతను యాప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అతను విమానం దిగే సమయంలో మాన్యువల్‌గానే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో 7 విమానాశ్రయాల తర్వాత మిగతా చోట్ల పునరుద్దరించే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications