ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహానికి అంకురార్పణ: ఈసారి ఎన్ని అడుగల ఎత్తంటే?
హైదరాబాద్: వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి బుధవారంనాడు అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహా గణపతి ఏర్పాటు కోసం బుధవారం సాయంత్రం 5 గంటలకు కర్రపూజను నిర్వహించారు.
ఈ పూజతో ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది 61 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే వచ్చే వారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్స కమిటీ తెలిపింది.

వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి కూడా ఖైరతాబాద్ మహా గణపతి మట్టితోనే తయారు చేయనున్నారు. గత ఏడాది కూడా మట్టితోనే తయారు చేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీపంచముఖ మహాలక్ష్మీ గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. కాగా, ఇటీవలి కాలంలోనే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
Bhagyanagar Ganesh Utsava Samithi member participated in the Karra Puja Karyakramam held today evening on the occasion of the inauguration of #Khairatabad Maha Ganapati works. pic.twitter.com/54Q5KB3tH1
— Dr.Ravinuthala Shashidhar (@shashidhar147) May 31, 2023
ఖైరతాబాద్ తోపాటు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా గణనాథులు నిలవనున్నారు. బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను విభిన్న రీతుల్లో తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.
-
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications