కూకట్‌పల్లిలో కారు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం, ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆటో, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సౌత్ ఇండియా మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
టీఎస్ 06 జీఈ 6999 అనే నెంబర్ గల కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారు, ఆటో, ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాలుగు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు.
యువకుడ్ని చితకబాదిన హిజ్రాలు
వినాయక నిమజ్జనం సమయంలో హిజ్రాలతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో.. విసుగు చెందిన హిజ్రాలు అతడిపై దాడి చేయడంతో అక్కడ్నుంచి పారిపోయాడు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications