చిక్కుల్లో రానా దగ్గుబాటి: రూ.కోట్లు విలువ చేసే బాహుబలి డీల్- కోర్టు నుంచి..!!
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, ఆయన తండ్రి, నిర్మాత డీ సురేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. భూకబ్జా ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో వారిద్దరికీ నాంపల్లి కోర్టు సమన్లను జారీ చేసింది.
హైదరాబాద్: ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి చిక్కుల్లో పడ్డారు. సమన్లను అందుకున్నారు. న్యాయస్థానం ముందు ఇక ఆయన హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డీ సురేష్ బాబు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. న్యాయస్థానం నుంచి ఆయన కూడా సమన్లు అందుకున్నారు. 18 కోట్ల రూపాయల మేర విలువ చేసే ఓ ల్యాండ్ డీల్ నేపథ్యంలో సమన్లు జారీ అయ్యాయి.
హైదరాబాద్ నగర శివార్లలోని షేక్ పేట్ లో 18 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆక్రమించుకున్నట్లు రానా, డీ సురేష్ బాబుపై ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్ కే చెందిన ప్రముఖ వ్యాపారి ప్రమోద్ కుమార్ ఈ మేరకు వారిద్దరిపైనా ఫిర్యాదు చేశారు. షేక్ పేట్ లోని భూమి తమదని, దాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ రానా దగ్గుబాటి, సురేష్ బాబు తనను భయభ్రాంతులకు గురి చేస్తోన్నారని ఆరోపించారు.

షేక్ పేట్ లో 2014లో వివాదాల్లో ఉన్న భూమిని నిర్మాత సురేష్ బాబు.. ప్రమోద్ కుమార్ కు లీజుకు ఇచ్చారు. లీజ్ గడువు ఇంకా ముగియలేదు. ఈ లోపే ఆ భూమిని విక్రయించాలని తాను సురేష్ బాబును కోరానని వివరించారు. దీనికోసం 18 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకున్నామని అన్నారు.
ఈ డీల్ కుదిరిన నేపథ్యంలో- లీజ్ గడువు ముగిసిన తరువాత ఈ భూమిని తనకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. దీనికి అడ్వాన్స్ గా అయిదు కోట్ల రూపాయలను సురేష్ బాబుకు చెల్లించానని వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సురేష్ బాబు పూర్తి చేయట్లేదని, దీన్ని ఆయన పట్టించుకోవట్లేదని ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ఈ వివాదం పరిష్కారం కాక ముందే సురేష్ బాబు ఈ స్థిరాస్తిని తన కొడుకు రానా దగ్గుబాటి పేరు మీదకి బదలాయించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. రానా దగ్గుబాటి, డీ సురేష్ బాబుకు సమన్లు జారీ చేసింది. భూ యజమాని పేరు బదలాయించడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని ఆరోపించారు.
రానా దగ్గుబాటితో పాటు సురేష్ బాబు పేర్లను ఆయన తన ఫిర్యాదులో పొందుపరిచారు. దీనిపై నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు- వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ నాంపల్లి కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications