హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో రూ. 50 కోట్ల డ్రగ్స్, రెండు రెడీమేడ్ ల్యాబ్స్ సీజ్: ఏడుగురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో సారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు రూ. 49.77 కోట్ల విలువైన మెఫిడ్రిన్ తోపాటు వీటిని తయారుచేస్తున్న రెండు ల్యాబొరేటరీలను సీజ్ చేశారు. హైదరాబాద్ డీఆర్ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ దందా వెనుకున్న సూత్రధారి, పెట్టుబడి దారుడిని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు.

నేపాల్ పారిపోతుండగా.. డ్రగ్స్ ప్రధాన నిందితుడి అరెస్ట్

నేపాల్ పారిపోతుండగా.. డ్రగ్స్ ప్రధాన నిందితుడి అరెస్ట్

నిందితుడు రూ. 60 లక్షల నగదుతో ఖరీదైన కారులో నేపాల్ పారిపాతుండగా.. చివరి నిమిషంలో అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్ 21న బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలోని ఓ కర్మాగారంలో ఆకస్మికంగా సోదాలు జరిపారు. రేకుల షెడ్డులో నిర్మించిన రెండు ల్యాబొరేటరీలల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

అత్యాధునిక ల్యాబ్‌లలో డ్రగ్స్ తయారీ

అత్యాధునిక ల్యాబ్‌లలో డ్రగ్స్ తయారీ

అత్యాధునిక పద్ధతిలో అప్పటికప్పుడు అమర్చుకోగలిగే పరికరాలను దిగుమతి చేసుకుని, వాటిన్నింటినీ అమర్చి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ల్యాబ్ లను సిద్ధం చేసినట్లు తెలుసుకున్నారు. అవసరమైన ముడి పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మెపిడ్రిన్ తయారు చేయడంతోపాటు దాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

24.8 కిలోల మెఫిడ్రిన్ స్వాధీనం, ఏడుగురి అరెస్ట్

24.8 కిలోల మెఫిడ్రిన్ స్వాధీనం, ఏడుగురి అరెస్ట్

కాగా, ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న 24.885 కిలోల మెఫిడ్రిన్ తోపాటు రూ. 18.90 లక్షల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగానే యూపీలోని డీఆర్ఐ అధికారులను అప్రమత్తం చేసి, కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారీకి అతనే ఆర్థిక సాయం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
చంగిచర్ల ల్యాబ్ లో సోదాల సమయంలో మారం భానుకుామర్, కీసర మరేగిరి, ధర్మేంద్ర పాఠక్, ప్రదీప్ బిస్వాస్, అశ్వినీ పాఠక్, సాయిరాం, శివశాస్త్రి, దీపక్ భగట్ లను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరికి 2016లో ఇండోర్ లో 236 కిలోల ఎఫిడ్రిన్ పట్టుబడ్డ కేసుతో, హర్యానాలో దొరికిన 667 కిలోల మెఫిడ్రిన్ కేసులతో సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. మరో నిందితుడికి హత్య కేసుతోనూ సంబంధం ఉందని గుర్తించారు. ఈ ఏడుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ 2022 మధ్య, డీఆర్ఐ అధికారులు సుమారు 990 కిలోల హెరాయిన్, 88 కిలోల కొకైన్, 10,000 మెథాంఫేటమిన్ మాత్రలు, 2,400 లీటర్ల ఫెన్సెడైల్ దగ్గు సిరప్, అనేక ఇతర హానికరమైన ఎన్పీడీఎస్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Hyderabad: DRI busts two drug labs in Hyderabad, seizes mephedrone worth Rs 50 crore, 7 arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X