హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా...
హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది.
ఈ నెల 19న సాయంత్రం 5గంటలకు మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తారని రెండు రోజుల క్రితమే అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది.
కాగా, కొద్దిరోజుల క్రితమే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. దాదాపు రూ.184కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45-ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేయనుంది. దీని పొడవు 754.38మీ. కాగా.. వెడల్పు ఆరు లేన్లు ఉంటుంది. ఎల్&టీ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించింది. దేశంలో కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

పాదాచారులు,సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ రాత్రి సమయంలో బ్రిడ్జి అందాలను రెట్టింపు చేయనుంది. ఈ బ్రిడ్జిపై రాకపోకలను ప్రారంభించనప్పటికీ... ఇప్పటికీ ఎంతోమంది సందర్శకులు ప్రతీరోజూ ఇక్కడికి వచ్చిపోతున్నారు. రాత్రిపూట జిగేల్ కాంతుల నడుమ బ్రిడ్జి పైనుంచి చెరువు అందాలను వీక్షిస్తూ మైమరిచిపోతున్నారు. ఒకరకంగా నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ బోటింగ్, రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో టూరిజం శాఖ ఉన్నది.
ఒకప్పుడు కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ నవాబులకు మంచి నీరందంచిన చరిత్ర దుర్గం చెరువుకు ఉన్నది. దాదాపు 83 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు దేశంలోని రహస్య తటాకాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications