Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం కేసు: నేరం అంగీకరించిన నిందితుడు, మరో మహిళ ఆచూకీ అభ్యం

హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనను పోలీసులు ఛేదించారు. అత్యాచార ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు నిందితుడు విజయ్ ఒప్పుకున్నాడని తెలిపారు.

Recommended Video

    Kalva Sujatha questioned what would have happened to the police system

    అత్యాచార ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగానే వెళ్లిందా? లేదా? అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే, తన ఇష్టపూర్వకంగానే ఆమె అతని వెంట వెళ్లినట్లు సమాచారం.

    Hyderabad: Gandhi hospital rape case: accused arrested.

    ఇది ఇలావుండగా, ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలు సోదరి ఆచూకీ గురువారం లభ్యమైంది. హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీసులు ఆమెను గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    కాగా, మహబూబ్‌నగర్ నుంచి ఆగస్టు 5న మూత్రపిండాల వ్యాధి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చారు. గదిలో బంధించి ఆ ఇద్దరు మహిళలపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు.

    గురువారం మహబూబ్‌నగర్‌కు వెళ్లి కేసుకు సంబంంధించిన మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అక్కా, చెల్లెళ్లు మద్యం ఉపసంహరణ లక్షణాల(అల్కాహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్)తో ఉన్నారని పోలీసులు గుర్తించారు. అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ కేసులు బాధితురాలిని మహిళా పోలీసులు రహస్య ప్రాంతంలో బుధవారం విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని మరో మారు రికార్డు చేశారు. బాధితులు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపించగా.. వైద్య నివేదికల్లో మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చడం గమనార్హం.

    సంతోష్‌నగర్ రేప్ అల్లిన కథే: బాధితురాలి తప్పుడు ఫిర్యాదు?

    దారి మళ్లించి, తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. అయితే, అత్యాచారం జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

    ఈ నేపథ్యంలో యువతి తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ల్యాబ్ టెక్నీషియయన్‌గా పనిచేస్తున్న యువతి.. ఆగస్టు 17న ఇంటి నుంచి విధులకు వెళ్లింది. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు వెళ్లింది. అయితే, ఆలస్యంగా రావడంతో కుమార్తెను తల్లిదండ్రులు ప్రశ్నించారు. తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని యువతి వారికి చెప్పింది. దీంతో యువతితోపాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.

    యువతి ఆటో ఎక్కిన సమయం, ఆమె చెప్పే అంశాలకు పొంతన లేదని నిర్ధారణకు వచ్చారు. యువతిది తప్పుడు ఫిర్యాదుగా భావించిన పోలీసులు ఆెను పూర్తిస్థాయిలో ప్రశ్నించారు. అంతేగాక, యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరగలేదని తేలినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడా కూడా ఆనవాళ్లు దొరకలేదు. మంగళవారం రాత్రి సంతోష్‌నగర్‌లోని యాదగిరి థియేటర్ వద్ద ఆటో ఎక్కినట్లు పోలీసులకు చెప్పిన యువతి.. ఆటో ఎక్కిన తర్వాత మరొక ఇద్దరు యువకులు వెనకల తనపక్కనే కూర్చున్నారని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిన తర్వాత తాన స్పృహకోల్పోయానని తెలిపింది. ఆ తర్వాత తేరుకుని ఇంటికి చేరుకున్నట్లు చెప్పింది.

    లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అత్యాచారం జరిగినట్లు ఆమె తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేల్చారు. పోలీసుల విచారణలోనూ తాజాగా ఆ యువతి తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది. తన ప్రియుడికి నిశ్చితార్థం అయిన నేపథ్యంలోనే అతడ్ని ఈ కేసులో ఇరికించాలని ఆ యువతి నాటకమాడినట్లు అనుమానిస్తున్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఓ యువతి ఇలాంటి తప్పుడు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇలా తప్పుడు ఫిర్యాదుల కారణంగా అసలైన బాధితులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+