బాలికపై పైశాచికం .. జనానాంగంపై బ్లేడుతో కోసి రేప్.. యూట్యూబ్ లో వీడియో
భాగ్యనగరం ఒక బాలికను కాపాడలేని అభాగ్యనగరంగా మారింది. మహిళా దినోత్సవాన వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అమ్మాయిల రక్షణను మరోసారి ప్రశ్నిస్తోంది. నిర్భయ ఉదంతాన్ని దేశం నేటికీ మర్చిపోలేకపోతుంది . భాగ్య నగరం నడిబొడ్డున మరో ఘాతుకం జరిగింది. పదహారేళ్ల బాలికపై ఒక బాలుడు చేసిన పైశాచిక దాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఒళ్లంతా బ్లేడుతో గాట్లు పెట్టి, జననాంగం పైన సైతం కోసి చిత్రహింసలు పెడుతుంటే దయచేసి నన్ను వదిలేయ్ అంటూ ఆ బాలిక ఆర్తనాదాలు చేసింది. ఉన్మాదంతో రెచ్చిపోయిన సదరు బాలుడు చేసే వికృత చేష్టలను అక్కడే ఉండి చూస్తున్న మరికొందరు బాలురు వీడియో చిత్రీకరించి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

బాలుడి పైశాచిక ప్రవృత్తి.. బాలిక జననాంగంపై బ్లేడ్ తో దాడి, అత్యాచారం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఒక బాలుడు పశువులా ప్రవర్తించాడు. అతని స్నేహితులు రాక్షసానందం పొందారు. ఒక బాలికను వివస్త్రను చేసి, ఇష్టమొచ్చినట్టు కొట్టి, ఒళ్లంతా బ్లేడుతో కోసి, జననాంగాన్ని సైతం గాయపరిచి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు బాధతో బాలిక ఆర్తనాదాలు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో వీడియో చిత్రీకరిస్తూ బాలిక శరీర భాగాలను చూపాలంటూ వేధింపులకు గురిచేశారు.

గంజాయి మత్తులో బాలిక పై దాడి.. వీడియో చిత్రీకరించి రాక్షసానందం
లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో చంద్ర నగర్ కాలనీ, లిబర్టీ, ఆయిల్ సీడ్స్ కాలనీకి చెందిన కొందరు బాలురు రోజు గంజాయి తాగుతూ ఉంటారు. వీరితో సన్నిహితంగా మెలిగిన ఒక బాలికను సైతం గంజాయి కి అలవాటు చేశారు సదరు బాలురు. గంజాయి మత్తులో ఈ నెల 2న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బాలుడు ఆమెపై అత్యాచారం చేయగా ఆ దృశ్యాలను స్నేహితులు చిత్రీకరించి, యు ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు అంతేకాకుండా ఆ వీడియోను మరికొందరు స్నేహితులకు షేర్ చేశారు.

వీడియో తొలగించాలని పదే పదే ప్రాధేయపడిన బాలిక
ఇక ఈ విషయం తెలిసిన బాలిక వీడియో ను తొలగించాలని నిందితుడిని పదేపదే ప్రాధేయ పడుతూ వచ్చింది. వీడియో తొలగించాలంటే డీబీఆర్ మిల్స్ వద్ద తనను కలవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు సదరు బాలుడు. ఇంట్లో స్నేహితులను కలవడానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో బాలిక కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు
దర్యాప్తు ప్రారంభించిన గాంధీనగర్ పోలీసులు బాలికను గుర్తించి అసలు విషయం తెలుసుకున్నారు. బాలికపై జరిగిన లైంగిక దాడి, దారుణమైన సంఘటన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేశారు. నిందితులకు దేహశుద్ధి చేసి, అతని ఫోన్ లోని వీడియో లను డిలీట్ చేశారు స్థానికులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లుగా వైద్యులు తెలిపారు.
నిందితుడికి ఎవరెవరు సహకరించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . నిందితుడు యూట్యూబ్‌లో పెట్టిన వీడియోను తొలగించటంతో పాటు బాలికకు భరోసాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు .
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications