Hyderabad: మరో ఘనత సాధించిన హైదరాబాద్.. మహిళలకు సేఫ్ సిటీగా నిలిచిన భాగ్యనగరం..
హైదరాబాద్ కు మరో ఘనత దక్కింది. దేశంలో మహిళలకు అత్యంత అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. మహిళలు ముందంజలో ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్ సిటీగా నిలిచింది. 'టాప్ సిటీస్ ఫర్ వుమెన్ ఇన్ ఇండియా' పేరుతో అవతార్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలించింది.

చెన్నై, పుణె, బెంగళూరు
మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత తదితర అంశాలను విశ్లేషించి అవతార్ గ్రూప్ ఈ నివేదిక రూపొందించింది. లివింగ్ ఇండెక్స్, జాతీయ గణాంకాలు, నేర రికార్డులు, మహిళా శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదిక వంటి 200పైగా అంశాలను విశ్లేషించి దేశంలోనే అనేక నగరాలకు ర్యాంకులు ఇచ్చింది. దేశంలో టాప్-5 నగరాల్లో వరుసగా చెన్నై, పుణె, బెంగళూరు తర్వాత హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ 14వ స్థానంలో ఉంది.

సౌత్ ఇండియా
దేశంలో మహిళలకు అనుకూలంగా ఉండే నగరాల విషయంలో అవతార్ గ్రూప్ ఏడాది పాటు 111 నగరాల్లో సర్వే నిర్వహించింది. 9 నగరాలు మాత్రమే సిటీ ఇంక్లూజన్ స్కోర్‌లో 60కి 50 పాయింట్లను దక్కించుకున్నాయి. ఇందులో సౌత్ ఇండియాలోని నగరాలే ఎక్కువగా ఉన్నాయని అవతార్ గ్రూప్ పేర్కొంది. ఈ సర్వేలో దేశంలోని అనేక రాష్ట్రాల రాజధానులు కనీసం 25 స్కోర్ కూడా దాటలేకపోయాయి. ఇక మహిళలకు అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు... అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ మొదటి స్థానం దక్కించుంకుంది.

స్నేహపూర్వక వాతావరణం
దక్షిణాది రాష్ట్రాల్లో మహిళ ఉద్యోగులకు స్నేహపూర్వక వాతావరణం ఉందని అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేశ్ తెలిపారు. సర్వే ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న టాప్ 25 నగరాల్లో చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, వైజాగ్, కోల్ కతా, కొయంబత్తూర్, మధురై టాప్ 10లో నిలిచాయి.

25 నగరలు
ఇక 10 లక్షలకు తక్కువ జనాభా ఉన్న 25 నగరాల్లో తిరుచిరాపల్లి, వెల్లూర్, ఈరోడ్, సేలమ్, తిరుపూర్, పుదుచ్చేరి, సిమ్లా, మంగళూరు, తిరువనంతపురం, బెలగావి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయని అవతార్ గ్రూప్ పేర్కొంది. నార్త్ ఇండియాలో ఢిల్లీ, శ్రీనగర్, అమృత్‌సర్ అక్కడి టాప్ 3 క్యాటగిరీలో ఉన్నాయి
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications