మరో పరువు హత్య: సికింద్రాబాద్‌లో వ్యక్తిని చంపిన దుండగులు
హైదరాబాద్: తిరుమలగిరిలో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని భార్య తరఫు బంధువులే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటన హైదరాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో చోటు చేసుకుంది.
నాలుగేళ్ల క్రితం టీచర్స్ కాలనీకి చెందిన యువతిని నందకిషోర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అల్లుడి పైన వారు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నందకిషోర్‌ను కొట్టి చంపారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. దీనిని పరువు హత్యగా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications