హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్ ప్రాస్టిట్యూషన్ : 14వేల మంది మహిళలు, యువతులు, డ్రగ్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో భారీ సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు. మనదేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళలు, యువతులతోపాటు విదేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు గుర్తించారు.

విటులకు మహిళలు, యువతులతో డ్రగ్స్ సరఫరా

విటులకు మహిళలు, యువతులతో డ్రగ్స్ సరఫరా

ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు ఎండీఎంఏ డ్రగ్స్ అలవాటు చేయడంతోపాటు బాధిత మహిళల ద్వారా విటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ మత్తు దందా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుగా సెక్స్ రాకెట్

వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుగా సెక్స్ రాకెట్

వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠా ఉచ్చులో 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్లు సీపీ వెల్లడించారు. వీరంతా ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందిన వారని తెలిపారు. నిందితులు పలు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, డ్రగ్స్ సీజ్

17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, డ్రగ్స్ సీజ్

నిర్వాహకులు ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్ లోనే నిర్వహిస్తున్నారని, ప్రధాన నిందితుడు అనుమానం రాకుండా తన ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు సీపీ తెలిపారు. ఈ ముఠాలోని మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 39 కేసులు నమోదు చేసి, నిందితుల వద్ద నుంచి 34 ఫోన్లు, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ తరహా ముఠాల ఉచ్చులో చిక్కుకోవద్దని సీపీ సూచించారు. అనుమానం వస్తే డయల్ 100, వాట్సాప్ నెంబర్ 9490617444కు ఫిర్యాదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరోవైపు, డీసీపీ కవిత మాట్లాడుతూ.. వ్యభిచార కూపాలపై దాడులు నిర్వ హించే క్రమంలో తీగలాగితే ఈ వ్యవహారం బయటపడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రా లకు చెందిన కొందరు నిందితులతోపాటు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెం దిన అర్నవ్‌ను ముఠా నాయకుడిగా గుర్తిం చినట్లు చెప్పారు. వీరిని విచారించగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న చీకటి తతంగం బయటపడిందని డీసీపీ కవిత వెల్లడింల్ల చారు.

English summary
international online prostitution racket busted in Hyderabad, over 14000 women victims; 17 arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X