Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. మరో రెండు నెలలు చుక్కలే..!
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉన్నందున తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఇక పెద్దపల్లిలో 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. వచ్చే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలోని జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో నేడు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రానున్న కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 5న అత్యధిక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం సోమవారం హైదరాబాద్‌లో, ఖైరతాబాద్‌లో నిన్న 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫ్‌నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ముషీరాబాద్, మారేడ్‌పల్లి, గోల్కొండలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. హైదరాబాద్ కూడా ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం బయట తిరగొద్దని వైద్యులు సూచించారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. ఈ ఎండకాలం వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలని.. తెలుపు వస్త్రాల అయితే మంచిదని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ కు బదులుగా దోసకాయ, పుచ్చకాయ, చెరకు రసం వంటి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications