హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరుదైన హైదరాబాదీ శునకం: ఏకంగా రూ. 20 కోట్లకు విక్రయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శునకాల ఖరీదు మనకు తెలిసిన వరకు అత్యధికంగా వేలు లక్షల ఖరీదులో లభిస్తాయి. కానీ, ఈ అరుదైన జాతి శునకం మాత్రం అక్షరాల రూ. 20 కోట్లకు అమ్ముడు పోవడం గమనార్హం. ఖరీదైన జాతి కుక్కలను కొనుగోలు చేసే బెంగళూరు వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కాకేసియన్ షెపర్డ్ కుక్కను రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు 'బెంగళూరు మిర్రర్' తన కథనంలో పేర్కొంది.

భారతదేశంలోనే అరుదైన జాతికి చెందిన ఈ కుక్కను హైదరాబాద్‌లోని ఓ పెంపకందారుడి నుంచి కొనుగోలు చేశారు. 1.5 ఏళ్ల వయసున్న దీనికి.. కాడబోమ్ హేడర్ అని పేరు పెట్టినట్లు ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు.

Hyderabad man sells rare breed dog for Rs 20 crore to bengaluru man.

ఇటీవల, త్రివేండ్రం కెన్నెల్ క్లబ్ ఈవెంట్, మరొక డాగ్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఉత్తమ కుక్క జాతికి 32 పతకాలను గెలుచుకుంది.
"హేడర్ చాలా పెద్దది, చాలా స్నేహపూర్వకంగా ఉంటుది. ప్రస్తుతం, అది నా ఎయిర్ కండిషన్డ్ నివాసంలో ఉంటోంది" కొనుగోలుదారు పేర్కొన్నారు.

కాగా, సతీష్ ఖరీదైన జాతి కుక్కలను కొంటుంటారు. 2016లో, ఒక్కొక్కటి కోటి రూపాయల ఖరీదు చేసే రెండు కొరియన్ మాస్టిఫ్‌లను సొంతం చేసుకున్న దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచాడు. అతను చైనా నుంచి కుక్కలను దిగుమతి చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్లలో వాటిని తీసుకెళ్లడం గమనార్హం.

నిర్భయమైన, ధైర్యంగా, దయతో వర్ణించబడిన కాకేసియన్ షెపర్డ్ జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్, ఒస్సేటియా, డాగేస్తాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన సంరక్షక జాతిగా చెప్పారు. తోడేళ్ళపై దాడి చేసే ప్రత్యేక సామర్థ్యం దీనికి ఉంది. పరిపక్వమైన కాకసస్ షెపర్డ్ 45 నుంచి 70 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ జాతి జీవితకాలం 10-12 సంవత్సరాల మధ్య ఉంటుంది.

English summary
Hyderabad man sells rare breed dog for Rs 20 crore to bengaluru man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X