హైదరాబాద్ అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు...
హైదరాబాద్ అబిడ్స్‌లో శుక్రవారం(ఫిబ్రవరి 5) రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ట్రూప్ బజార్‌లోని డీకే శానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడగా... స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయతనిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. గతేడాది నవంబర్‌లో అబిడ్స్ సమీపంలోని గన్‌ఫౌండ్రీలోనూ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. చెప్పుల దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గోదాంతో పాటు హోటల్, దాబాకు వ్యాపించాయి. దీంతో ఆయా దుకాణాల్లో ఫర్నిచర్, సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ... భారీగా ఆస్తినష్టం జరిగింది.

రెండేళ్ల క్రితం ఇదే అబిడ్స్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణంలోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగంతస్తుల ఆర్‌ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణం పూర్తిగా అగ్ని కీలల్లో చిక్కుకుంది. దుకాణంలోని కోట్లాది రూపాయల విలువ చేసే వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. రాత్రి దుకాణం మూసివేసి దుకాణంలో సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. మూసి వేసిన దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన సెక్కురిటీ సిబ్బంది, స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. తొలుత మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా మూడు అంతస్తులకు కూడా విస్తరించాయి. బట్టల దుకాణం కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.ఫైర్ సిబ్బంది అయిదు ఫైరింజన్ల సాయంతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications