ఇక హైదరాబాద్ మెట్రో రైలు మరింత స్పీడ్‌గా..: సూపర్ సేవర్ ఆఫర్ నేటి నుంచే
హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్ళు మరింత వేగంగా వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ(సీఎంఆర్ఎస్) అనుమతించినట్లు ఎల్అండ్‌టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న వేగం కంటే మరో పది కిలోమీటర్లు వేగంగా వెళ్లేందుకు అనుమతి లభించింది. రైళ్ల వేగాన్ని మార్చి నెలలో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.

మెట్రో రైలు వేగం పెరగడంతో ప్రయాణికులకు సమయం ఆదా
వేగం పెరగడంతో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గనుంది. నాగోలు-రాయదుర్గం మధ్య 6 నిమిషాల ప్రయాణ సమయం, మియాపూర్-ఎల్బీనగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య 1.5 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. గతంలో 80 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైళ్లు ప్రయాణించేవి.. పెంచిన వేగంతో 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కానీ, ప్రతి స్టేషన్ వద్ద ఆగడంతో ఈ వేగం సాధారణంగా కొంత వరకు తగ్గనుంది.
మెట్రో సూపర్ ఆఫర్..
ఇది ఇలావుండగా, హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ ఆఫర్ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సెలవు రోజుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో ప్రయాణించే అవకాశం మెట్రో కల్పించిన విషయం తెలిసిందే. కాగా, ఉగాది కావడంతో శనివారం, ఆదివారం కావడంతో రేపు ఆఫర్ వర్తించనుంది.
ఏడాదిలో వంద రోజులపాటు మెట్రో సూపర్ సేవర్ ఆఫర్
మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్డుతో హైదరాబాద్ జంట నగరాల్లో 57 మెట్రో స్టేషన్ల మధ్య ఎన్ని సార్లైనా తిరిగే అవకాశం ఉంటుంది. ఏడాదిలో 100 సెలవు దినాల్లో మాత్రమే.. ఈ ఆఫర్ వర్తించనుంది. మొదటగా రూ. 50తో కార్డు తీసుకుని రూ. 59 రీచర్జ్ చేసుకుంటే ఆఫర్ ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారంతోపాటు ముఖ్యమైన పండగలకు ఈ ఆఫర్తించనున్నట్లు మెట్రో యాజామాన్యం వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో అధికారులు ఈ ఆఫర్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications