హైదరాబాద్ మెట్రో ‘పార్కింగ్’ బాదుడు!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ యాజమాన్యం భారీ షాకిచ్చింది. ఇక నుంచి వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్‌​లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని ఎల్​అండ్ ​టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) స్పష్టం చేసింది. మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లు ఉండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది.

వీటిలో చాలా స్టేషన్లలో ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్‌​లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. అయితే, ఇప్పుడు ఆ రెండు చివరి స్టేషన్లలో కూడా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తివేసింది. దీంతో పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు పెంచడంతో పాటు పార్కింగ్ ఫీజుతో వసూళ్లకు పాల్పడటం అన్యాయమంటూ ఎల్​అండ్​టీ తీరుపై మండిపడ్డారు.

Hyderabad Metro Rail Official announcement On Metro Parking Fee

ఈ ఘటనపై స్పందించిన ఎల్​అండ్ ​​టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నాగోల్, మియాపూర్ స్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని తేల్చి చెప్పింది. ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రోస్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది. పైలట్ రన్‌​గా బుధవారం నాగోల్ మెట్రో స్టేషన్‌​లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పరిశీలించామని, ప్రయాణికుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేసి ఆగస్టు 25 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది.

నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎల్​అండ్ ​టీ.. పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు 24 గంటలు సీసీ కెమెరాల నిఘా, సులభమైన పద్ధతిలో చెల్లింపు విధానాలు, బయో టాయిలెట్స్ సౌకర్యం కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ఫీజులను పర్మినెంట్‌గా డిస్​‌ప్లే చేస్తున్నామని సంస్థ తెలిపింది. ప్రయాణికులు తమ మద్దతు, సహకారాన్ని ఎల్ ​అండ్​ టీ మెట్రో రైలుకు అందించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ప్రయాణికులు, మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మెట్రోరైలు టికెట్ల ధరలు పెంచి, ఇప్పుడు పార్కింగ్‌​కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. ఇటీవలే మెట్రో టికెట్ ఛార్జీలు పెంచారని, ఇప్పుడు పార్కింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తూ తమకు మెట్రో ప్రయాణం మరింత భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజులు ఇలా..

ద్విచక్ర వాహనం కనీసం 2 గంటల సమయం వరకు పార్క్ చేస్తే రూ. 10, 8 గంటల వరకు అయితే రూ. 25, 12 గంటల వరకు అయితే రూ. 40 చెల్లించాలి.

ఇక కారు పార్క్ చేసిన 2 గంటల సమయానికి రూ. 30, 8 గంటలకు రూ. 75, 12 గంటల వరకు రూ. 120 చొప్పున ధరలు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+