అబిడ్స్ సర్కిలో కేసీఆర్ జాతీయ గీతాలాపన: పెద్ద ఎత్తున పాల్గొన్న యువత (వీడియో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా మంగళవారం ఉదయం 11.30 గంటలకు జాతీయగీతం ఆలపించారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ యావత్ తెలంగాణ జాతీయ గీతం జనగణమన ఆలపించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లు సహా ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాగా, హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై 'జనగణమన' ఆలపించారు. కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు పాల్గొన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు, స్టేషన్లలోనూ జాతీయ గీతాన్ని ఆలపించారు. 11.30 గంటలకు మెట్రో రైళ్లు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత మెట్రో రైల్లోని ప్రయాణికులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కాగా, హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణ జిల్లాలు కూడా జాతీయ గీతాలాపనతో మారుమోగాయి.












Click it and Unblock the Notifications