హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో: పంజగుట్టలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్: సిటీ బస్‌పై బంగీ జంప్‌

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలో ఓ మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. ఫ్లైఓవర్‌కు ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీస్ ఔట్‌పోస్ట్‌పైకి ఎక్కిన అతను చాలాసేపటి వరకూ అక్కడే తిష్ఠ వేశాడు. కిందికి దిగిరావడానికి మొరాయించాడు. చివరికి పోలీసులు సాహసం చేసి.. అతణ్ని కిందికి దించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతణ్ని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. అనంతరం బంధువులకు అప్పగించారు.

అతని పేరు రాజుగా గుర్తించారు. పఠాన్ చెరు సమీపంలోని రామంద్రాపురంలో నివసిస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఉదయం అతను పంజగుట్ట చౌరస్తా మధ్యలో ఉన్న ట్రాఫిక్ ఔట్‌పోస్ట్‌పైకి ఎక్కాడు. చొక్కాను విప్పేసి.. దానితో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఫ్లైఓవర్ కింద వేలాడుతోన్న తాడును పట్టుకుని వేలాడుతూ కనిపించాడు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు అతణ్ని కిందికి దిగిరావాలంటూ పలుమార్లు సూచించినప్పటికీ.. అతను వినిపించుకోలేదు. అక్కడే తిష్టవేశాడు.

Hyderabad: Police and motorists rescued a mentally unstable man at Panjagutta

Recommended Video

New Year 2021: 2021 ని యువత ఎలా ఆహ్వానించబోతున్నారు ? | Coronavirus Pandemic

అనంతరం అదే తాడును పట్టుకుని అటుగా వెళ్తోన్న సిటీబస్సుపై అమాంతం దూకేశాడు. బస్సు టాప్ మీది నుంచి కిందికి రావడానికీ మొండికేశాడు. దీనితో డ్రైవర్ బస్సను అక్కడే నిలిపివేశాడు. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పంజగుట్ట పోలీసులు బస్ టాప్ మీదికి ఎక్కి అతన్ని కిందికి దించారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడనేది తెలియ రాలేదు. మతి స్థిమితం లేకపోవడం వల్లే అలా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.

రాజు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు అతణ్ని నిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొస్తుండగా.. తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. వారి చేతుల్లో నుంచి తప్పించుకుని.. ట్రాఫిక్ పోలీస్ ఔట్‌పోస్ట్‌పైకి ఎక్కి, హల్‌చల్ చేసినట్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు అతణ్ని అప్పగించి, నిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో పంజగుట్ట వద్ద కొద్దిసేపు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

English summary
Police and motorists rescued a mentally unstable man, who creates ruckus at Panjagutta in Hyderabad on Monday. The man identified as Raju, resident of Ramachandrapuram near Pathancheru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X