జిమ్ ట్రైనర్‌పై కానిస్టేబుళ్ల దాష్టీకం: విచక్షణా రహితంగా కర్రలతో దాడి, కాలు విరిగింది (వీడియో)
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడలో ఆరోఖ్యరాజ్ అనే జిమ్ ట్రైనర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. పెద్ద కర్రలతో ఇష్టారీతిన దాడికి పాల్పడటంతో జిమ్ ట్రైనర్‌కు కాలు విరిగింది. దీంతో అతడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. విచక్షణారహితంగా పోలీసులు దాడి చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే.. జూన్ 3న బైక్ విషయంలో మరో వ్యక్తితో ఆరోఖ్యరాజ్‌కు చిన్న గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల సమయంలో ఆరోఖ్యరాజ్ వద్దకు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు. అయితే, ఇప్పుడు రాత్రి అయిందని.. ఉదయం వస్తానంటూ ఆరోఖ్యరాజ్ వారికి సమాధానమిచ్చాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌పై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కర్రలతో కొట్టి కాళ్లతో తన్నారు.

తనను కొట్టొద్దంటూ అతడితో పాటు తల్లి ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినలేదు. కానిస్టేబుళ్ల దాడిలో బాధితుడికి శరీరమంతా గాయాలు కావడంతో పాటు కాలు కూడా విరిగింది. బాధితుడి కేకలు విని బస్తీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులే బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.
@TelanganaCMO @TelanganaCS @TelanganaDGP @KTRTRS garu,
— Dr. Mahesh Banda (@DrMaheshBanda) June 6, 2022
Could you please advice police to be little more gentle.
This is Mettuguda police torturing a gym trainer... happened on 3rd June.
Thank you pic.twitter.com/vi1MA1W2aP
ఆ తర్వాత పోలీసులే బేరసారాలకు వచ్చినట్లు బాధితుడు చెప్పారు. ఈ ఘటనను ఇక్కడితో వదిలేయాలని కోరినట్లు సమాచారం. అయితే, ఆరోఖ్యరాజే ముందు తమపై దాడి చేసేందుకు యత్నించాడని.. తాము ప్రతిదాడి చేశామని కానిస్టేబుళ్లు చెబుతుండటం గమనార్హం. సామాన్యుడిపై పోలీసులు ఇలా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంపై స్థానికులతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా మండిపడుతున్నారు. ఇంత దారుణంగా పోలీసులు కొట్టడంపై కాంగ్రెస్ నేత మాణికం టాగూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ పార్టీ నేత అంజన్ కుమార్ యాదవ్.. ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించినట్లు తెలిపారు.
#NoPoliceBrutality
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 6, 2022
- The Chilakalguda SHO brutally beat up a man accused of creating nuisance.
- Arokya Raj, a gym trainer from Mettuguda
TS police beat him up when he refused to go with them at that time of the night and told them that he would visit the PS in the morning 1/2 pic.twitter.com/bfTGOcCW6Y
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications